Sunday 19 July 2015

యంత్రాలను నమ్ముకో

                                                     ధన్య ఒక 20 రోజుల క్రితంవరకు తనకు పనిమనుషులు లేకపోతే ఇంట్లో చాలా
ఇబ్బంది అనుకుని అందరికన్నా ఎక్కువ జీతం ఇచ్చి మరీ ముప్పొద్దులా తినటానికి వేడివేడిగా విందుభోజనంలాగా అన్నీపెట్టేది.ఉద్యోగరీత్యా వేరేవేరే నగరాల్లో ఉన్నప్పుడు కూడా పనివాళ్ళతో ఏఇబ్బందీ లేదు.అలాంటిది ఈ మధ్య స్వంతఊరిలో పాత పనివాళ్ళు వయసురీత్యా పెద్దవాళ్ళవటంతో కొత్త పని వాళ్ళను మాట్లాడుకోవటంతో చుక్కలు చూపెట్టారు.పనిమనిషి రాగానే అమ్మా!టీ పెట్టండమ్మా!టీ తాగకపోతే పనిచెయ్యలేను అనేది.గమనిస్తారనుకుంటే  ఒక రకంగా  గమనించకపోతే ఒకరకంగా పని  చేసేది.బట్టలు ఉతకటానికి వచ్చిన అమ్మాయి అమ్మా!నాకు ఆకలి వేస్తుంది తినటానికి టిఫిన్ పెట్టండమ్మా!మీరు తప్ప ఎవరూ పెట్టరు అనేది.పోనీ పని ఏమన్నా శుభ్రంగా చేస్తారా!అంటే అదేమీ లేదు.మేడపైకి తీసికెళ్ళి బట్టలు ఉతకకుండా మంచి వాసన వచ్చే ద్రవం వేసి నీళ్ళల్లో ముంచి ఆరేసేది.ఇద్దరూ మొదట అనుకున్న సమయానికి రాకుండా ఇబ్బంది పెట్టేవాళ్ళు.పని ఉండి ఎక్కడికైనా వెళ్ళాలన్నా సమయానికి రాకపోవటం వల్ల ఇబ్బందిగా ఉండేది. ఈ ఇద్దరితో విసిగిపోయిన ధన్యకు పనివాళ్ళంటేనే విసుగు వచ్చేసింది.వీళ్ళకు నేను చాకిరి చేసి అన్నీపెట్టి,డబ్బిచ్చి,రోజూ వీళ్ళకోసం ఎదురు చూడటం విసుగ్గా ఉందనుకుని ఎవరి పని వాళ్ళు చేసుకోవటం అంత ఉత్తమం రెండోది లేదనుకుని ధన్య ఇద్దరికీ స్వస్తి పలికి బట్టలకు,గిన్నెలకు,ఇల్లు శుభ్రం చేయటానికి యంత్రాలు తెచ్చుకుంది.ఎన్నో సంవత్సరాలుగా పనివాళ్ళు లేకపోతే పొద్దు గడవదు అనుకునేది.ఇప్పుడు  వాళ్ళు లేకపోతే హాయిగా ఉంది.ఎప్పటి నుండో ధన్య కూతురు అమ్మా!మనుషులకన్నా యంత్రాలను నమ్ముకో సౌకర్యంగా ఉంటుంది అంటుంటే ఇద్దరు మనుషులకు పని కల్పించనట్లవుతుందిలే అనేది ధన్య. ధన్యకు ఇప్పుడు కూతురు చెప్పినదే నిజం అనిపిస్తుంది.వీలయినప్పుడు యంత్రాలలో వేస్తే వాటిపని అవి చేస్తున్నాయి. పనివాళ్ళ కన్నా చాలా బాగా శుభ్రంగా చేస్తున్నాయి.ఇప్పుడు ధన్యకు చాలా సౌకర్యంగా ఉంది.  

No comments:

Post a Comment