Monday 6 July 2015

చిన్న మెదడు చితికి.......

                                                           హరనాధ్ పిల్లల చదువులకోసం నగరానికి వచ్చాడు.కొడుకు కుటుంబాన్ని చూచి వెళ్దామని తండ్రి ఊరు నుండి వచ్చాడు.నాలుగు రోజులు ఉండేటప్పటికి పెద్దాయన  జ్వరంతో, వాంతులతో బాధపడుతుంటే ఆసుపత్రిలో చేర్చారు.తండ్రికి భోజనం తీసుకుని హరనాద్ ఆసుపత్రికి బయలుదేరాడు.దారిలో రోడ్డు దాటుతుండగా అకస్మాత్తుగా ఆటోవాడు వచ్చి కొట్టేసరికి హరనాద్ డివైడర్ మీద పడి తలకు గట్టిదెబ్బ తగిలింది.తండ్రి ఉన్న ఆసుపత్రిలోనే కొడుకును కూడా చేర్చారు.వైద్యులు స్కానింగ్ తీసి చిన్న మెదడు పూర్తిగా చితికిపోయింది కనుక వెంటనే ఆపరేషన్ చెయ్యాలని చెప్పారు.మనిషి బ్రతికున్నా ఇంతకు ముందు లాగా ఉండడు అని చెప్పారు.మనిషి బ్రతికితే చాల్లే అనుకుని ఇంట్లోవాళ్ళు సరేనన్నారు.ఈవిషయం తండ్రికి తెలియదు.ఏ నిమిషం ఏమి జరుగుతుందో అన్నట్లు తండ్రికోసం వెళ్ళి చావుబతుకుల మధ్య వెంటిలేటర్ మీద ఉన్నాడు.బ్రతకొచ్చు లేదా బ్రతకక పోవచ్చు చెప్పలేని పరిస్థితి.నిర్లక్ష్యంతో కూడిన అతివేగం మనిషి ప్రాణాలమీద కొచ్చింది.పిల్లలు చిన్నపిల్లలు.తండ్రి లేని పిల్లలైపోతారేమోనని కుటుంబ సభ్యులు,బంధువుల బాధ.

No comments:

Post a Comment