Saturday 25 July 2015

కుడితిలో పడ్డ ఎలుక

                                   ప్రతీక చిన్నప్పటి నుండి నలుగురికి ఉపయోగపడే విధంగా తనకు లాభదాయకంగా ఏదైనా వ్యాపారం చేద్దామని  ఆలోచిస్తూ ఉండేది.ఉద్యోగం చేస్తూ వ్యాపారం గురించి ఆలోచించే తీరిక ఉండటంలేదని లక్షల జీతం వచ్చే బంగారం లాంటి ఉద్యోగానికి రాజీనామా చేసింది.ఏది మొదలెడదామన్నాఎత్తుభారం మొత్తుకోళ్ళు.ఒక పక్క ప్రశాంతంగా చేసుకునే లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకున్నందుకు ఇంట్లోవాళ్ళ అక్షింతలు.తనకు నచ్చిన వ్యాపారం చేద్దామంటే అనువుగా లేని వాతావరణ పరిస్థితులు.మనసుకు నచ్చని వ్యాపారం చేయలేని పరిస్థితి.ప్రస్తుతం ప్రతీక పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా ఉంది.ప్రతీక ఆలోచన మంచిదే కానీ ఆచరణలో సాధ్యం కావాలంటే కొన్నాళ్ళు కష్టపడక తప్పదు.ప్రతీక పట్టుదల ముందు పరిస్థితులు తలొగ్గి తను అనుకున్నది త్వరలో తప్పక సాధించగలదని ఇంట్లో అందరి నమ్మకం.

No comments:

Post a Comment