Wednesday 22 July 2015

రంపల రాకాసి

                                                   సుశాంతికి విదేశాలలో పెద్దవాళ్ళు కూడా ఎంతో హుషారుగా ఎవరిపని వారే చేసుకోవటం  చూచి మనం ఎంత సోమరిపోతులుగా ఉన్నామో?అనిపించింది.పనివాళ్ళతో కూర్చుని అన్నిపనులు చేయించుకోవటం వల్ల శరీరానికి తగిన వ్యాయామం లేక బరువు పెరిగి అక్కడనొప్పి,ఇక్కడనొప్పి అంటూ ఆసుపత్రుల చుట్టూ తిరగవలసి వస్తుందని అనుకుంది.అయినా అంత పెద్దవాళ్ళు ఎవరిపనులు వాళ్ళు చేసుకోగాలేనిది నేను చేసుకోలేనా ఏమిటి?అని ఒకపెద్ద నిర్ణయం తీసుకుంది.అలవాటు లేని పనులు చేసుకోవటం కష్టం అని ఇంట్లోవాళ్ళు చెప్పినా వినకుండా నేను చేసుకోగలను అని ప్రగల్భాలు పలికింది.నగరంలో ఎక్కడ ఉన్నాయో అంతర్జాలంలో వెదికి ఇంటి పనులకు ఉపయోగపడే అన్నిరకాల సరికొత్త మోడల్ యంత్రాలను తెప్పించింది.అదే ఇంట్లో వాళ్ళు గానీ,మరెవరైనా చేయమంటే నన్ను పని చేయమంటారా?అంటూ రంపల రాకాసి లాగా మీదపడేది.ఒక్కరోజు పనిమనిషి రాకపోతే వేరేవాళ్ళు వచ్చి చెయ్యాల్సిందే తప్ప ఇటుగిన్నెఅటుపెట్టేది కాదు.సుశాంతి తనకుగా తను స్వనిర్ణయం తీసుకోవటం వల్ల ఏ బాధా లేకుండా సంతోషంగా చేసుకుంటుంది.

No comments:

Post a Comment