Saturday 4 July 2015

రోజుకో రెండు

                                   ఖర్జూరాల్లో ఒకప్పుడు పండువి,ఎండువి మాత్రమే దొరికేవి.అబ్బో!ఇప్పుడు రకరకాల   ఖర్జూరాలు మార్కెట్లో దొరుకుతున్నాయి.ఏరకానికి చెందినవైనా రోజుకో రెండు తింటే వాటివల్ల చాలా ప్రయోజనాలున్నాయి.కాన్సర్,ఆస్టియోపొరాసిస్ వంటివి దరిచేరకుండా ఉంచుతాయి.కళ్ళకు,దంతాలకు ఎంతో మంచిది.దీనిలో ఇనుము ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనత బారిన పడకుండా ఉంటాము.ఖర్జూరం తిన్న వెంటనే అలసట,నీరసం తగ్గి వెంటనే శక్తి వస్తుంది.ఎండు ఖర్జూరాలు నీళ్ళల్లో  రాత్రిపూట నానబెట్టి ఉదయం తింటే కొలెస్టరాల్ అదుపులో ఉంటుంది.గుండెకు కూడా మంచిది.ఖర్జూరాలు తినటం వల్ల జుట్టు కుదుళ్ళు బలంగా తయారయి జుట్టు రాలకుండా ఉంటుంది. 

No comments:

Post a Comment