Sunday 12 June 2016

ఏనుగు తలకాయంత

                                                                   అనసూయ సునయనకు దూరపు బంధువు.ఇంటికి వచ్చిందంటే మాట్లాడింది మాట్లాడకుండా లొడలొడా మాట్లాడుతూనే ఉంటుంది.ఇంతే కాకుండా అప్పుడప్పుడు డబ్బాలో గులకరాళ్ళు వేసి గబగబా తిప్పితే వచ్చే శబ్దం లాగా పళ్ళుఅన్నీ బయట పెట్టి నవ్వుతూ ఉంటుంది.పాపం ఏమిటో?ఎదుటివాళ్ళు విన్నావినకపోయినా ఆపకుండా ఎన్ని గంటలైనా మాట్లాడుతుంది.ఆ వాగ్దాటికి అడ్డు వచ్చినా,ఎవరైనా చిన్న మాట ఎదురు మాట్లాడినా వెంటనే వెక్కిళ్ళు పెట్టి ఏడ్చి బొటబొటా కన్నీళ్లు పెట్టేస్తుంది.తన ధోరణి తనది.మధ్యమధ్యలో అమ్మాయ్ మాట్లాడి మాట్లాడి తలకాయ బద్దలవుతుంది కానీ వేడివేడి కాఫీ పట్టుకురా!చల్లరితే నాకు అసలే నచ్చదు అంటూ హుకుం జారీ చేస్తూ ఉంటుంది.ఒక్కొక్కసారి విసుగు అనిపించినా అప్పుడప్పుడు ఆమె సుత్తి భరించక తప్పదు.మొన్నొకసారి బజారుకు వెళ్లిందట.ఎక్కడ చూసినా నిగనిగలాడుతూ నోరూరిస్తూ నేరేడుపళ్ళు కనిపిస్తే ఒక 1/4 కేజి 70 రూ.పెట్టి కొంటే 20 కాయలే వచ్చినాయని చెప్పింది.నేరేడు కాయలు కూడా అంత ఖరీదు పెట్టి కొనబుద్ది కాలేదు కానీ మనం మనకి తెలియకుండానే సంవత్సరానికి  ఏనుగు తలకాయంత క్రిముల్నితింటామట.అందుకని తప్పనిసరిగా ఏడాదికి ఒకసారైనా నేరేడు పళ్ళు తినాలని అమ్మమ్మ చెప్పేది.అందుకే కొద్దిపాటి వగరుగా ఉన్నానచ్చకపోయినా చచ్చినట్లు తినాల్సిందే ఎవరైనా మీరు కూడా తెచ్చుకోండి అని వెళ్తూ వెళ్తూ ముక్తాయింపుగా చెప్పి వెళ్ళింది.

No comments:

Post a Comment