Sunday 12 June 2016

పేగులకు అతుక్కుని .....

                                                           చిత్తరంజన్ పేరుకు తగ్గట్లే చిత్రంగా మాట్లాడతాడు.ఒకరోజు ఉదయం అల్పాహారంలో  దోసె,కొబ్బరి పచ్చడి తిని పక్క ఊరికి వెళ్ళి పని పూర్తయిన తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చేసరికి కడుపునొప్పి మొదలయిందట.వెళ్ళింది మొదలు ఉదయం నుండి సాయంత్రం వరకు తీరిక లేక మంచి నీళ్ళు సైతం తాగలేదట.కడుపునొప్పి ఎక్కువయ్యేసరికి ఆసుపత్రికి వెళ్తే మామూలు కడుపునొప్పి అనిచెప్పి సెలైన్ పెట్టి మందులు ఇచ్చి పంపించారట.ఇంటికి వచ్చిన తర్వాత ఉదయం తిన్న కొబ్బరి పచ్చడిలో నీరు ఇంకిపోయి కొబ్బరి పేగులకు అతుక్కుని కడుపునొప్పి వచ్చిందని అందరికీ చెప్పడం మొదలు పెట్టాడు.అసలే నోరెక్కువ ఎదురుగా నవ్వితే తిడతాడని విచిత్రం కాకపోతే కొబ్బరి పేగులకు అతుక్కోవడం ఏమిటి?కడుపునొప్పి రావడం ఏమిటి?అని చాటుకు వెళ్ళి ఒకరికొకరు చెప్పుకుని నవ్వుకోవడం మొదలుపెట్టారు.

No comments:

Post a Comment