Wednesday, 15 June 2016

హృదయాకారంతో మెరుపు

                                                                     హృదయాకారంతో ఎర్రగా ఉన్న స్ట్రాబెర్రీలు చూడగానే  భగవంతుడు సృష్టించిన ఆకృతి మనల్నిఆశ్చర్యపరిచినా వెంటనే కొనుక్కుని రుచి చూద్దామన్నంతగా అందరినీ ఆకర్షించదు.కానీ వింతగా కోమలి మాత్రం చిన్నప్పటినుండి ఇష్టంగా తినేది.సూపర్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు అది కావాలి,ఇది కావాలి అంటూ ఎంత అల్లరి చేసేదయినా స్ట్రాబెర్రీలు ఒక పెట్టె కొనిస్తే బుద్ధిగా ఒకచోట కూర్చుని మొత్తం తినేసేది.పెద్దయిన కొద్దీ ఆ ఇష్టం పెరిగింది కానీ తగ్గలేదు.ఒకరోజు అందరూ కూర్చుని మాట్లాడుకుంటుండగా నీ పళ్ళు మా అందరికన్నా తెల్లగా తళతళ మెరుస్తున్నాయి ఏమిటి రహస్యం?అని అడిగింది మేనత్త.నేను చిన్నప్పటినుండి ఇష్టంగా తినే స్ట్రాబెర్రీలు అని చెప్పింది.అదెలాగంటే పండిన స్ట్రాబెర్రీలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పళ్ళకు మెరుపు ఇస్తాయని చెప్పింది.

No comments:

Post a Comment