Thursday 9 June 2016

మహోపకారి

                                                                      ఈ రోజుల్లో అధిక బరువు పెద్ద సమస్యగా తయారైంది.ఆలస్యంగా నిద్రపోవడం,ఆలస్యంగా నిద్ర లేవడం,చిరుతిళ్ళు ఎక్కువగా తినడం,కూరగాయల వాడకం తగ్గించి మాంసాహారం తినడం,వ్యాయామం సరిగా చేయకపోవడం వంటి రకరకాల కారణాల వల్ల బరువు పెరగడం మొదలవుతుంది.పెరిగిన బరువును వదిలించుకోవడానికి ఎన్నోరకరకాల  ప్రయత్నాలు చేస్తూ ఉంటాము.అసలు తిండి తినకపోవడము,అధికంగా తినడము రెండు తప్పే.ఆహారంలో మార్పులు చేస్తూ తేలికపాటి వ్యాయామంతో చాలావరకు ప్రయోజనం ఉంటుంది.బరువు తగ్గాలనుకునే వారికి బార్లీ మహోపకారి.రోజు బార్లీ ఏదోఒక రూపంలో తీసుకుంటే బరువు తగ్గటమే కాక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మధుమేహం,గుండె,ఊపిరితిత్తులు,మూత్రనాళ సమస్యలు రాకుండా ఉంటాయి.కొలెస్టరాల్ ని అదుపులో ఉంచుతుంది.మూడు వంతులు జొన్నలు,ఒక వంతు బార్లీ కలిపి పిండి పట్టించి దానితో రొట్టె చేసుకుని తింటే రెండు నెలల్లో ఎనిమిది కేజీల బరువు తగ్గటమే కాక మదుమేహం,కొలెస్టరాల్ సాధారణ స్థాయికి వచ్చిందని స్నేహితురాలి స్వీయ అనుభవం.ఓట్స్ కన్నా కూడా బార్లీ మిన్న.బార్లీ నీళ్ళు తాగటం ఒక్కటే కాక ఉడికించిన గింజలతో సలాడ్లు,రవ్వతో ఉప్మా,కిచిడీ,వడలు రకరకాలుగా చేసుకుని తినవచ్చు.

No comments:

Post a Comment