Wednesday 11 December 2013

గురువింద గింజ

        గురువింద గింజ చిన్నగా కోడిగ్రుడ్డు షేప్ లో ఉంటుంది.పైన మంచి ఎరుపు రంగులో,క్రింద నలుపు రంగులో చూడటానికి చాలాఅందంగా ఉంటుంది.అందుకని గురువిందగింజకు చాలాగర్వం.ఎందుకంటే తనక్రింద ఉన్ననలుపు తనకు తెలియదు కనుక  నేనే గొప్ప అందగత్తెను అని అన్నింటికన్నా గొప్పదానినని ఫీల్ అవుతుందట.
         గ్రీష్మ చుట్టాల్లో ఒకామెకు75 ఏళ్ళు వుంటాయి.ఆమె ఎక్కడ ఫంక్షన్ ఉన్నా అక్కడకు వెళ్లి తనొక్కటే గొప్ప
దానిలాగా అందరూ ఎందుకూ పనికిరాని వాళ్ళలాగా గొప్పలు పోతుంటుంది.ఆమె ముందే ఫంక్షన్ వాళ్ళఇంటికి
వెళ్లివాళ్ళతో మంచిగామాట్లాడి బంగారం,డబ్బు ఎవరికీ తెలియకుండా తీసుకొస్తుంది.పెళ్ళికివెళ్తే వాళ్ళకు,వీళ్ళకు
కూడా ఉన్నవి,లేనివి చెప్పితగువులు పెడుతూఉంటుంది.తర్వాత అసలువిషయం తెలుస్తుంది.ఈమె వస్తుందంటే చాలుఅందరికీ భయం.ఎక్కడ తగువులు పెట్టేస్తుందో,ఏమిదొంగిలిస్తుందోనని జాగ్రత్తపడేవాళ్ళు.అయినాఏదోఒకటి
చేస్తూనేఉంటుంది.ఆమెకుఎన్నోఇబ్బందులున్నాయి.అయినాఎదుటివాళ్ళకు ఏమీలేకున్నాగోరంతలుకొండంతలు చేసి చెప్తుంటుంది.
         ఆమె వయస్సు వాళ్ళల్లో 100మందిలో 10మంది ఉంటే ఈ రోజుల్లో 100మందికి 75మంది ఆమెలాగే వుంటున్నారు.చదువుకున్నవాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు.ఎవరిగురించి వాళ్ళు గొప్పచెప్తున్నారంటేనే
వాళ్ళెంత గొప్పవాళ్ళో అర్థంచేసుకోవచ్చు.సరే స్వోత్కర్ష  చెప్పుకొన్నాఎదుటివాళ్ళ గురించి తక్కువచేసిచెప్పటం
ఫ్యాషన్ అయిపోయింది.అది ఎంత తప్పోఅర్థం చేసుకోవటంలేదు.ఎదుటివాళ్ళువిన్నంతసేపువిని ప్రక్కకు వెళ్లి
నవ్వుకుని ఇంకొంతమందికి చెపుతుంటారని వాళ్లకు అర్థం కాదు.వినేవాళ్ళు కూడా తెలియకుండానే వాళ్ళను
ప్రోత్సహిస్తున్నామని అనుకోవట్లేదు.
              ఇలా గొప్పలు చెప్పుకొని ఎదుటివాళ్ళను అవమానించేవాళ్ళను గురువింద గింజలతో పోలుస్తారు.
గురువింద గింజ తన క్రింది నలుపు ఎరగదు అని తరతరాలుగా ఉన్నశాస్త్రం.   

No comments:

Post a Comment