జ్యోత్స్న ఇంటి ఓనర్ ఒక పరాన్నజీవి(పారాసైట్).ఒక ఆమె కదా ఇండిపెండెంట్ ఇల్లు అని ఎక్కువ అయినా ఆ
ఇంటికి అద్దెకు వెళ్ళింది.ఆ తర్వాత కానీ అది ఎంత తప్పో అర్థం కాలేదు.ఉదయం జ్యోత్స్న భర్త,పిల్లలు వెళ్ళగానే
పైనుండి దిగి జ్యోత్స్నదగ్గరకువచ్చి మళ్ళీ భర్త,పిల్లలు ఇంటికి వచ్చేవరకూ సోదిచెపుతూ టిఫిను,కాఫీ,భోజనం,
టీ అన్నీ ఇక్కడేతినేది,తాగేది.తింటూ అందులో ఉప్పు తగ్గింది,కారం తగ్గింది అంటూ పేర్లు పెడుతూతినేది.వచ్చి
కూర్చుని తినేదికాక పేర్లు పెట్టకపోతే వండుకుని తినవచ్చు కదా అని జ్యోత్స్నకు అరికాలి మంట నెత్తికి ఎక్కేది.
కొంచెంసేపయినా విశ్రాంతిగాఉండనిచ్చేది కాదు.ఆమెకు కాస్త పిచ్చి ఉంది .అందుకే అలాచేస్తుంది.ఎవరువచ్చినా
అలాగే విసిగించేస్తుంది.అందుకే ఎవరూ ఎక్కువ రోజులు ఉండరు అని తెలిసినవాళ్ళు చెప్పారు.ఇంటిఓనరు ఇలా
ఉదయంనుండి విసిగిస్తుంది అనివాళ్ళ అమ్మతోచెప్పటం విన్నది.అప్పటినుండి నీళ్ళురాకుండా వాల్వ్ కట్టేసేది.
వాళ్ళు నీళ్ళు ఎక్కువ వాడతన్నారు అని అందరికీ చెప్పేది.తను వచ్చివీళ్ళ ఇంట్లోపడి మేస్తన్నానని చెప్పేదికాదు.
మొదట ఇంట్లోకి వచ్చేటప్పుడు నీళ్ళ బిల్లు చెరిసగం అని చెప్పింది.తర్వాత నేను ఒక్క దాన్నేగా అని జ్యోత్స్న వాళ్ళతో మొత్తం బిల్లు కట్టించేది.ఇలా మాటమీద నిలబడకుండా మాట మార్చేవాళ్ళంటే జ్యోత్స్నకు చిరాకు.ఒక మాటఅంటే ఆమాట మీద నిలబడాలి.అలామాట నిలబెట్టుకొనలేని వాళ్ళు మొదటే మాట్లాడకూడదు.ఇది ఆమెకే
కాదు ఇలాటివాళ్ళందరికీ వర్తిస్తుంది.ఆమెకంటే మతిస్థిమితం లేదనిఅనుకొందాం.ఇలాంటిమాట నిలబెట్టుకోలేని
వాళ్ళ పరిస్థితి ఏమిటి?జ్యోత్స్న దృష్టిలో ఇది చాలా పెద్ద తప్పు.నష్టం వచ్చినా,కష్టంగాఉన్నా జ్యోత్స్నమాటఅంటే
ఆ మాటమీదే ఉంటుంది.ఒక్క జ్యోత్స్నేకాదు ఇలాంటివాళ్ళు చాలామంది ఉన్నారు.అదే మంచి జరుగుతుందని
జ్యోత్స్ననమ్మకం.మాట తప్పినవాళ్ళకి భాధ వుండదేమో కానీ ఎదుటివాళ్ళు ఎంత భాధ పడతారు.వాళ్ళు అలా
బాధపడితే వీళ్ళకి కలిసి వస్తుందా?అని ఆలోచిస్తే ఎవరూ అలా చేయరు.ఇది చదివిన తర్వాత అయినా కొంత మందిలో అయినా మార్పు వస్తుందని నా ఆశ.దయచేసి మొదటే సరిగ్గా మాట్లాడుకోవటం నేర్చుకోండి.

No comments:
Post a Comment