Friday, 20 December 2013

హార్మొనీ పెట్టె

   కమల తాతగారు ఊరిపెద్ద .ఒక సంగీతం మాస్టారు తనకు ఉపాధి చూపించమని కమల తాతగారి వద్దకు
వచ్చారు.అప్పుడు ఆయన తన మనుమరాలు కమలకు చుట్టుప్రక్కల వారి పిల్లలకు సంగీతం నేర్పించమని
చెప్పారు.అలా కమలతోపాటు ఒక పదిమంది పిల్లలకు సంగీతం నేర్పించటం మొదలు పెట్టారు.కమల తాతగారు
ఒక హార్మొనీ పెట్టె కొనిచ్చారు.స,రి,గ,మ,ప,ద,ని,స అంటూ పిల్లలు నేర్చుకొనేవారు.కొన్నిరోజులు నేర్పిన తర్వాత
మాస్టారి ఆరోగ్యం సరిగా లేక వాళ్ళ పిల్లల ధగ్గరకు వెళ్ళిపోయారు.తర్వాత పిల్లలు సంగీతం నేర్చుకోవటం మానేసారు.
 ఒకతను హార్మొనీ పెట్టె మేడలో వేలాడేసుకొని పాటలు పాడుకొంటూ బియ్యము,డబ్బులు కోసం వచ్చేవాడు.
తనకు ఐదుగురు పిల్లలని ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పాడు.అతని పెట్టె పాతది అయిసరిగా పనిచెయ్యడంలేదు.
అందుకని కమల తాతగారు కమల హార్మొనీ పెట్టె అతనికి ఇప్పించారు.తన భుక్తి కోసం కొత్తపెట్టె ఇచ్చారనే
కృతజ్ఞతతోనో ఏమో అతను చుట్టుప్రక్కల అందరి ఇళ్ళకు వచ్చినా కమల వాళ్ళింటికి మాత్రం వచ్చేవాడు కాదు.
అలా హార్మొనీ పెట్టె అతని భుక్తికి ఉపయోగపడింది.    
   

No comments:

Post a Comment