Saturday 28 December 2013

సర్వం వ్యాపారం

                                                 మాలతి,మాధురి ఏదయినా స్వంతంగా పెట్టుకుందామని  శిక్షణకు వెళ్లారు.ఫీజు తీసుకోవటానికి చూపినంత ఆసక్తి శిక్షణ ఇవ్వటానికి చూపలేదు.ఒకసారి వెళ్ళినవాళ్ళు ఎవరికయినా అక్కడ శిక్షణ బావుంది  ఫలానా చోట శిక్షణ తీసుకోండి అని వేరే వాళ్ళకు ఎలా చెప్పగలరు?అమాయకంగా నేతిబీరకాయలో నెయ్యి ఉందని అనుకున్నట్లు ఏదో నేర్చుకుందామని వస్తూనే ఉంటారు.వీళ్ళు వెళ్లి ఎంత మందికి చెపుతారులే అనుకొంటారో ఏమోగానీ,సరిగ్గా శిక్షణ ఇస్తే మంచి పేరు వస్తుందన్నఆలోచనే ఉండదు.ఇప్పుడు డబ్బు చేతిలో పడింది అన్నఉద్దేశ్యం తప్ప మంచి ఆలోచనలేదు.తీసుకున్న డబ్బుకు న్యాయం చేద్దామన్నఇంగిత జ్ఞానం ఉండటం లేదు.సర్వం వ్యాపారంగా ఉంది.దానికి శిక్షణ ఇస్తాము,దీనికి శిక్షణ ఇస్తాము అని ప్రకటనలు ఇవ్వడం,బోర్డు పెట్టుకోవటమే కానీ వాటివల్ల ఉపయోగం లేకుండా ఉంది.మొదటి నాలుగు రోజులు రంగుల ప్రపంచాన్ని కళ్ళ ముందు ఉంచినట్లు కబుర్లు ఆ తర్వాత ఎందుకు వచ్చిన ఖర్మ అన్నట్లు ఉండటం మళ్ళీ కొత్తవాళ్ళను వెదుక్కోవటం పాతవాళ్లు విసుగు వచ్చి మానెయ్యడం యధా రాజా తధా ప్రజా అన్నట్లు ఉంటుంది పరిస్థితి.ఏది నేర్చుకోవాలనుకున్నా సరయిన శిక్షకులు దొరికితే డబ్బు ఖర్చు పెట్టినా నేర్చుకున్నామన్న తృప్తితోపాటు ఉపయోగం ఉంటుంది.మా వల్ల ఇంతమంది జీవితాలు బాగున్నాయన్న సంతోషం నేర్పే వాళ్ళకు కలుగుతుంది.ఇప్పుడు వీటన్నిటి కన్నా డబ్బే ముఖ్యం. 

No comments:

Post a Comment