Monday 16 December 2013

వసుంధరాదేవి గారి పెరడు

      వసుంధరాదేవి గారి ఇల్లు చూడముచ్చటగా వుండేది.ఇంటిముందు పెద్ద పూలతోట ,ఇంటి వెనుక పెద్ద పెరటితోట ఉండేవి.ఇంటి పెరట్లో రకరకాల కూరగాయలు,పండ్లు,ఆకుకూరలు,పాదులు ఉండేవి.ఒకటి ఉంది,
ఒకటి లేదు అనుకోకుండా అన్నిరకాలు ఉండేవి.విత్తనాలు కొనుక్కొచ్చి మరీ ఇంట్లో అందరూ శ్రద్దగా
పెట్టేవారు.బీర,నేతిబీర,కాకర,చిక్కుడు,సొర,తమ్మపాదు,దోస,ఇలా అన్నిరకాలు ఉండేవి.పందిళ్ళు వేసి
కాయించేవారు.ఇది 50సంవత్సరాల క్రితం సంగతి.ఇలా ఎందుకు చెప్పానంటే ఆరోజుల్లో ఇంత శ్రద్ధగా అన్నీ
పెట్టేవాళ్ళు కాదు.ఇక ఆకుకూరలు అయితే ఆరోజుల్లోకూడా పాలకూర,చుక్కకూర,తోటకూర,పెద్దబచ్చలి,
చిన్నబచ్చలి,గోంగూర,పుదీనా,కొత్తిమీర,మెంతుకూర,చామఆకు మొదలయినవి ఉండేవి.కూర అరటి
అయితే 150 కాయలతో పెద్దగెలలు వేసేవి.
      ఒకప్రక్కన అమృతపాణి,కర్పూరఅరటి,చక్రకేళి,పచ్చఅరటి ,అన్నిరకాలతో అరటితోట ఉండేది.ఇంకొక
ప్రక్కన జామ,దానిమ్మ,నిమ్మ,గజనిమ్మ,నారింజ,బత్తాయి,సపోటా,ద్రాక్షపందిరి ఉండేవి.అన్నీకూడా విరగ
కాసేవి.బెండ,దొండపాదు,గోరుచిక్కుడు,వంగ,టొమాటో,మిర్చి,సీమమిరప ఉండేవి.వాళ్ళింట్లో వాడుకొని
మిగతావన్నీ చుట్టాలకి ,ఇరుగు,పొరుగు,ఊరందరికీ పంపేవారు.అవన్నీ పంచిపెట్టటానికి ఒకమనిషి
ప్రత్యేకంగా ఉండేవాడు.ఎప్పుడయినాఎవరింట్లో అయినా కూరగాయలు లేకపోతే అడిగి తీసుకెళ్ళేవాళ్ళు.
పలానా వాళ్ళఇల్లు ఎక్కడ అని ఎవరయినా అడగగానే తీసుకొచ్చి మరీ పంపేవారు.ఆమె అంటే అంత గౌరవం.
       
       


  

No comments:

Post a Comment