Tuesday 17 December 2013

కోమలాదేవి గారి పూదోట

      కోమలాదేవి గారి ఇల్లు రంగురంగుల పూలతోటతో అందంగా కళకళలాడుతూ ఉండేది.ఒకపువ్వు ఉండి ఇంకొకటి లేదుఅని అనుకోకుండా అన్నిరకాలు ఉండేవి.గులాబీలు,మందారాలు అన్నిరంగులూ ఉండేవి.
ఒక్కొక్క మొక్కకు పాతిక పువ్వులు పూసేవి.ఎక్కడెక్కడి నుండో తెప్పించి మరీ తోటలో నాటించేవారు.
సన్నజాజి,విరజాజి,మల్లె పందిరికి పూసేవి.మల్లెలో బొడ్డుమల్లె అర్ధరాత్రికి విచ్చేవి.ఇవి పూలజడకు బావుండేవి.
వేసవి సెలవుల్లో వాళ్ల పాపతోపాటు అందరు పిల్లలు తలా ఒకరోజు పూలజడ వేసుకోనేవాళ్ళు.మొగ్గ పొడవుగా
ఉండడంవలన జడ చాలా బావుండేది.ఇంకొకరకం మల్లె చిన్నగులాబి అంత పూసేది.ఈరెండు వీళ్ళింట్లో మాత్రమే
ఉండేవి.నాటుమల్లె,గుండ్రనిమల్లె,సెంటుమల్లె పూసేవి.అందరికీ పంచేవాళ్ళు.బంగాళాబంతి,బంతి,చామంతి
చాలారంగులు పూసేవి.40సంవత్సరాల క్రితం ఎవరింట్లో ఇన్నివెరైటీలు ఉండేవికాదు.ఆలిక్స్ రంగురంగులవి పూసేవి.
ఈవిత్తనాలు మధ్యప్రదేశ్ నుండి తెచ్చి వేసారు.ఇవేకాక మరువం,ధవనం,మాచుపత్రిఉండేవి.ఇవికొద్దిమంది వద్ద
మాత్రమే ఉండేవి.ఇవి పూలతో కలిపి మాల కట్టుకుంటారు.పూదానిమ్మ కూడాఉండేది.క్రోటన్స్ అయితే చాలా
ఉండేవి.ఇంట్లో అందరూ శ్రద్ధగా ఎక్కడ క్రొత్త వెరైటీ కనిపించినా తెచ్చేవారు.అలాగే తెగుళ్ళు రాకుండా చూసేవాళ్ళు.
బాగా పోషణ చేయటం వలన పెద్దపెద్ద పువ్వులు పూసేవి.వాళ్ళ అమ్మాయి డ్రెస్ కి తగిన మాచింగ్ పువ్వు
పెట్టుకొనేది.ఎవరూ అడిగినాపువ్వులు ఇచ్చేవాళ్ళు.ఇలా రంగురంగులపూలతో, పచ్చగా,కళగా కోమలాదేవిగారి
పూదోట వెలిగిపోయేది.  

No comments:

Post a Comment