పిచ్చయ్యకు ముగ్గురు పిల్లలు.ఇద్దరు మగపిల్లలు,ఒకఆడపిల్ల.ఆడపిల్ల కొంచెం అమాయకంగా ఉంటుంది.పెళ్లి అయిందికానీ భర్త మంచివాడు కాకపోవటంతో ఇంట్లోనే ఉంటుంది.ఇద్దరు మగపిల్లలు.పిల్లలను తాత,మేనమామలే చదివించారు.ఇరవై సంవత్సరాల తర్వాత పెద్ద మనవడు తండ్రి దగ్గరకు వెళ్ళాడు.అక్కడ వాళ్ళ ఆస్తి తగాదాల్లో పెద్ద మనవడు చనిపోయాడు.చిన్నమనవడు స్వార్ధపరుడు.పిచ్చయ్య పెద్దకొడుకు,చిన్నకొడుకు కష్టపడి బాగా చదువుకున్నారు.పిచ్చయ్య పగలనక,రేయనక కష్టపడి వ్యవసాయం చేసి పొలాలు కొని డబ్బు సంపాదించాడు.పిచ్చయ్య భార్య భర్తకు తెలియకుండా ధాన్యం అమ్ముకొని వడ్డీకి డబ్బులు అప్పు ఇచ్చి స్వంతంగా ఆమెకు తోచినట్లు సంపాయించేది.పిచ్చయ్య పెద్దకొడుక్కి ఉన్నత కుటుంబంలోని అమ్మాయిని ఇచ్చారు.బుద్ధిమంతుడు,చదువుకున్నాడు వీళ్ళల్లో కొంచెం లోపాలున్నా ఏముందిలే అని ఇచ్చారు.రెండో కొడుకు తెలివి కలవాడే అయినా ఒక మోస్తరు సంబంధం వచ్చింది.పెద్దకోడలు ఫ్యామిలీకి తెలిసిన సంబంధమే అయినా గొప్పసంబంధం అని డప్పు కొట్టిమరీ చెప్పుకున్నారు.పిచ్చయ్య కొడుకుల్నిచదివించాను కనుక ఇంటికింద డబ్బులు ఇవ్వాలని వసూలు చేశాడు.అవి కావాలి ఇవి కావాలి అని తినుబండారాలు పంచి పెట్టుకోవటానికి అని ఉత్తరాలు రాయించి మరీ అందరికీ పంచకుండా ఇష్టమైనవాళ్లకు ఇచ్చి తిన్నన్ని రోజులు తిని చెత్తకుప్పలో పారబోసుకునే వాళ్ళంట.ఇంతోటి దానికి ఎదుటి వాళ్ళను ఇబ్బందిపెట్టి అడక్కోవడమేమిటో?అప్పట్లో మిఠాయిలు ఊరిలో పంచిపెట్టేవాటి దగ్గర గొడవలు జరిగి ఒకళ్ళు,ఇద్దరువిడాకులు తీసుకున్నారు.లేకిగావాళ్ళు నోరు తెరిచి అడగగాలేనిది చిన్నచిన్న వాటికీ గొడవలు ఎందుకులే?పోనీ వాళ్ళు అడిగినవి పంపిద్దాములే అని పెద్దకోడలు తరపు వాళ్ళు అడిగినవి అన్నీఇచ్చారు.చిన్నకోడలుకి వీళ్ళ గొంతెమ్మకోర్కెలు తీర్చలేక ఏదో ఒక వంక చెప్పి తప్పించుకోనేవాళ్ళు.పంచిపెట్టడానికి పంపలేకపోయారని చెప్పుకోలేక వాళ్ళ అమ్మకు పెద్దజబ్బు చేసింది అని చేప్పేవాళ్ళు.చిన్నకోడలుకూడా ఒకమాదిరి తెలివితేటలు కలది.పెద్దకోడలు తెలివికలది,పిల్లలు తెలివి కలవాళ్ళు అని మురిసేవాళ్ళు.చిన్నకొడుక్కి అన్న భార్యను,పిల్లలను పొగడటం ఎంత మాత్రం నచ్చలేదు.తగిన అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తున్నాడు.ఇదిపెద్దకొడుకు వాళ్ళు గమనించారు కానీ అంత కక్ష ఉంది అనిఊహించలేదు.చిన్నమనవడు బైక్ మీద తాతను ఎక్కించుకొని కుక్క అడ్డువచ్చిందని తనుదూకేసి తాతను వదిలేశాడు.కొంతదూరం బైక్ ఈడ్చుకెళ్ళి తలలో రక్తం గడ్డకట్టి,కోమాలో కెళ్ళి మూడు రోజుల తర్వాత బ్రతికాడు.పెద్దకోడలు తరపు వాళ్ళు బంధువుల ఆస్పత్రిలో చేర్చి మంచి వైద్యం చేయించటం వల్ల బ్రతికాడు.రెండు నెలల తర్వాత ముందే పది రోజులు విహార యాత్రకు వెళ్ళటానికి పెద్దకొడుకు వాళ్ళు ఏర్పాటు చేసుకోటం వల్ల వెళ్ళక తప్పలేదు.వెళ్లి వచ్చిన తర్వాత పిచ్చయ్య భార్య మీరు అనవసరంగా మామయ్యను ఆసుపత్రికి తీసుకెళ్ళి బతికించటం వల్ల నేను చాకిరీ చెయ్యలేక చచ్చిపోతున్నాను.నా పసుపుకుంకుమలు కోసం మీరు చూశారు ఇప్పుడు నాకు ఇబ్బంది అయింది అని కోపంగా పెద్ద కోడలుతో అంది.ఇదేమిటి?ఈమె ఇలా మాట్లాడుతున్నది అనుకుంది పెద్దకోడలు.భర్తని బతికించినందుకు రోజూ ఆయనకు చాకిరీ చేయాల్సి వచ్చిందని పెద్దకొడుకు,కోడలిపై కక్షకట్టి పిచ్చయ్యభార్య,చిన్నకొడుకు,మనవడుతో కలిసి పిచ్చయ్యతో ఆస్థి మొత్తం పెద్దకొడుక్కి తెలియకుండా విహార యాత్రకు వెళ్ళినప్పుడు చిన్నకొడుక్కి,మనవడికి దొంగ చాటుగా రాయించింది.చిన్నాడు అక్కని అన్నకు,ఒదినకు ఈవిషయం చెపితే చంపేస్తానని బెదిరించాడు.పెద్ద కొడుకు కుటుంబం విహార యాత్రకు వెళ్ళి వచ్చేసరికి కన్నవాళ్ళు,తోడబుట్టిన వాళ్ళు అయిన తన స్వంతవాళ్ళే మోసంతో నమ్మకద్రోహం చేశారు.
No comments:
Post a Comment