సునందిని వర్షం పడేలాగా ఉందని తలుపులన్నీ వేసి లోపలికి వచ్చింది.సన్నటి జల్లులతో మొదలైన వర్షం భారీగా ఒక గంటపాటు ఆగకుండా కురుస్తూనేఉంది.వాతావరణం ఆహ్లాదకరంగా ఉందని తలుపు
తీసి వరండాలోకి వచ్చేటప్పటికి ఒక పదమూడేళ్ళ అమ్మాయి వరండాలో బిక్కుబిక్కుమంటూ నిలబడి ఉంది.ఆంటీ
మా ఇల్లు ఇక్కడకు దగ్గర్లోనే ఉంది.వర్షం పడుతుందని వచ్చాను.మీఇంట్లో గొడుగు ఉంటే ఇవ్వండి.రేపు తెచ్చిస్తాను
అని అడిగింది.సరేనని రేపు తెస్తుంది కదా అనుకుని తనకు ఎంతో ఇష్టమైన గొడుగు ఇచ్చింది.ఇరవై రోజులైనా గొడుగు తీసుకురాలేదు.తర్వాత పనిమనిషితో పిల్ల తడుస్తుందని గొడుగు ఇస్తేతిరిగి ఇవ్వలేదని, పిల్ల ఎలాఉందీ గుర్తులుచెప్పగానే వాళ్లకు నేను పనిచేస్తానని,గొడుగు తెచ్చి ఇవ్వమని చెప్తానని చెప్పింది.తల్లి కూడా ఏమీ ఎరగనట్లుగా ఊరుకుంది.పిల్లలు ఏదైనా వస్తువు తెస్తే ఎక్కడిదీ?ఎందుకు తెచ్చారో కనుక్కుని తిరిగిఇచ్చి పంపాల్సిన బాధ్యత పెద్దలది.కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఎదుటివాళ్ళ వస్తువులు తీసుకుని సక్రమంగా తిరిగి ఇవ్వరు.ఇది చాలా చెడ్డ అలవాటు.ఒక నెలరోజులకు గొడుగు విరగ్గొట్టి సునందినికి ఇచ్చి సారీ ఆంటీ వెంటనే ఇవ్వటం మర్చిపోయాను.మాచెల్లి విరిచేసింది అని చెప్పింది.
తనకు ఎంతో ఇష్టమైన గొడుగును అలాచూచేసరికి సునందినికి నోటమాట రాలేదు.కాసేపటికి తేరుకుని ఏఫీలింగ్ లేకుండా ఆఅమ్మాయి చెప్పిన విధానానికి ఆశ్చర్యపోయి ఇకనుండి నీవస్తువులు నువ్వే మర్చిపోకుండా తీసుకెళ్ళు.ఎప్పుడైనా తీసుకున్నా ఎలాతీసుకున్నవో అలాగే తిరిగి ఇవ్వటం నేర్చుకోఅని చెప్పింది.ఇక అప్పటినుండి ఆఅమ్మాయి ఎక్కడ కనిపించినా సునందిని పిల్లలు"గొడుగు పిల్ల"అదుగో అని అంటూ ఉంటారు.

No comments:
Post a Comment