Sunday 26 October 2014

కూరగాయలతో ఆమ్లెట్

పచ్చి బఠాణీ - 50 గ్రా.
బంగాళదుంప - 1
కారట్ - 1
టొమాటో - 1
ఉల్లిపాయ - 1
పచ్చి మిర్చి - 1
కొత్తిమీర - 1 చిన్న కట్ట
కోడిగ్రుడ్లు - 2
                                     ముందుగా బంగాళదుంప,కారట్ పీల్ చేసి చిన్నచిన్న ముక్కలుగా చేసి బఠాణీలతో కలిపి మెత్తగా ఉడికించాలి.దీనిలో కోడిగ్రుడ్లను కొట్టి వేసి బాగా గిలకొట్టి సన్నగా తరిగిన ఉల్లిపాయ,టొమాటో,కొత్తిమీర,పచ్చి మిర్చిముక్కలను కలిపాలి.పెనం మీద ఆమ్లెట్ వేసి నూనెగానీ,నెయ్యిగానీ మన ఇష్టం వచ్చినది వేసుకోవచ్చు.దీన్ని అన్నంతో కానీ,చపాతీతో కానీ,విడిగా కానీ తినవచ్చు. 

3 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. అమెరికాలో ఉండగా జరిగిన ఒక తమాషా సంఘటన. ఒక ఫుడ్ & డ్రగ్ స్టోర్‌లో కూరగాయలు వగైరా కొంటున్నాం. బిల్లు చెల్లించటానికి రిజిష్టర్ దగ్గర ఉన్నాం. మా ముందున్న కష్టమర్ ఒకామె తాను కొన్నవన్నీ‌ రిజిష్టర్ కౌంటర్లో పేర్చుతోంది. నా దృష్టి వాటిలోని ఒక చిన్న టిన్ పైన పడింది. దానిమీద వెజిటబుల్ బీఫ్ అని పెద్దగా ముద్రించి ఉంది. అంటె ఏమిటీ అని అడిగితే కాష్ రిజిష్టర్ దగ్గర అమ్మాయి చెప్పింది. బీఫ్ తోపాటే ఆ టిన్‌లో బీన్స్ కూడా ఉంటాయట. కాసిని వెజిటబుల్స్ కూడా ఉన్నాయి కాబట్టి వెజిటబుల్ బీఫ్ అంటారట!

    మీరూ అలాగే వ్రాసారు. వెజిటబుల్స్ ఉండబట్టి వెజిటబుల్ ఆమ్లెట్ అన్నమాట!

    నేనేమో అమాయకంగా కేవలం వెజిటబుల్స్‌తో కూడా ఎలా అమ్లెట్ చేయచ్చునో చెబుతారనుకున్నాను!

    ReplyDelete
    Replies
    1. కోడిగ్రుడ్డు లేనిదే ఆమ్లెట్ ఎలా వేస్తాం?కూరగాయలతో కలిపి ఎలా వేసుకోవాలో తెలియచేయటం నా ఉద్దేశ్యం.మీరు చెప్పిన సంఘటనలో కూడా బీఫ్ అని వివరంగా ఉంది.మనం అర్ధం చేసుకునేదాన్ని బట్టి ఉంటుంది.ఏదైనా ఎలాంటివాళ్ళైనా అర్ధం చేసుకునేలా ఉండాలని తెలియచేసినందుకు ధన్యవాదములు.

      Delete