యశోధరకు కొద్దిగా ముఖ పరిచయమున్న ఒకామె అనుకోకుండా పదిసంవత్సరాల తర్వాత రోడ్డుకి అవతల ఉన్న ఎదురింట్లో కనిపించి ఏమండోయ్ అని పిలిచి మరీ నన్నుమీరు
గుర్తుపట్టారా?అని అడిగింది.రెండు నిమిషాల తర్వాత ఆమె పేరు విజయఅనీ,తిక్కమనిషనీ,ఎప్పుడూ గొప్పలు చెప్తూ ఉంటుందనీ గుర్తొచ్చింది.ఇప్పుడు కూడా వదలకుండా తన ఇద్దరు ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఆరునెలల తేడాతో చేశామని గొప్పగా చెప్పింది.చెప్పింది ఊరుకోకుండా తన తిక్కతనం నిరూపించుకోవటానికన్నట్లుగా పదిసంవత్సరాల క్రితం మీకు జ్వరం వచ్చిందంటకదా!ఆరోగ్యం బాగుందా?అని అడిగింది. యశోధరకు ఏమి చెప్పాలో తెలియక ఆమె అడిగినదానికి తగినట్లుగానే తలాడించింది.ఏంటో?ఈరోజుల్లో కూడా ఇలాంటి తిక్క ప్రశ్నలు వెయ్యటం మానుకోరు.
పదిసంవత్సరాల క్రితంవచ్చిన జ్వరం గుర్తుపెట్టుకుని ఇప్పుడు అడగటం హాస్యాస్పదంగా ఉంటుందనే ఆలోచనే లేదు.ఏమి మనుషులో ఏంటో?విచిత్ర మనస్తత్వం.అనవసర విషయాలు వదిలేసి అవసరమైన విషయాలు గుర్తుపెట్టుకుంటే బాగుంటుందనిపించింది.అదీకాక అధికప్రసంగం చేసినా ఎదుటివారికి విసుగొస్తుంది.

No comments:
Post a Comment