జానకిరామయ్య గారికి తొంభైఆరు సంవత్సరాలు.అయినా పూర్తి ఆరోగ్యంతో తనపనులు తాను చేసుకుంటూ ప్రతిరోజూ క్రమం తప్పకుండా సాయంత్రం పార్కువరకు వెళ్ళి అక్కడ పిల్లలతో కాసేపు కబుర్లు చెప్పి వారి ఆటలు చూస్తూ సరదాగా వారితో కాలక్షేపం చేసి ఇంటికి రావటం అలవాటు.ఆయనకు ఒక్కతే కూతురు.ప్రతిరోజూ పార్కు నుండి వచ్చిన తర్వాత కూతురితో మనుమరాలు,మునిమనుమళ్ళ ముచ్చట్లు చెప్పటం ఆయనకు అలవాటు.మాటల మధ్యలో అమ్మాయ్!ఈరోజు బుధవారం.నేను పుట్టినరోజు కూడా బుధవారమే.ఏరోజు పుడితే అదే రోజు చనిపోతారని మా తాతలు చెప్పేవాళ్ళు నేను కూడా అంతే చనిపోతానని అనిపిస్తుంది అన్నారు.అలా ఏమీ కాదులే నాన్నా!లోపలకు రండి అంటూ ఆమె లోపలకు వెళ్ళింది.ఆయన ఎంతసేపటికీ లోపలకు రాకపోయేసరికి మళ్ళీబయటకు వచ్చి నాన్నాఅంటూ చెయ్యి పట్టుకునేసరికి ప్రక్కకు వాలిపోయారు.ఆమెకు ఏమీ అర్ధంకాక వైద్యునికి ఫోను చేసింది.ఆయన వచ్చిమీనాన్నగారు చనిపోయరనేసరికి ఒక్కసారిగా గొల్లుమంది.చుట్టుప్రక్కల వాళ్ళందరూ ఆయన ఎంతో అదృష్టవంతుడు తిరుగుతూ తిరుగుతూ ఎవరితో చాకిరీ చేయించుకోకుండా పోయాడు అని కూతుర్ని ఓదార్చారు.ఈలోపు మనుమరాలికి ఫోనుచేస్తే విదేశానుండి హుటాహుటీన కుటుంబంతో వచ్చింది.అందరూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ అంత్యక్రియలు పూర్తిచేశారు.
No comments:
Post a Comment