మాలతి ముచ్చటపడి చీరలపై పెయింట్ వేయడం నేర్చుకుంది.తనకు నలుపు అంటే అమితమైన ఇష్టం.ఎంతో ముచ్చటపడి నల్లచీర కొని దానిపై తనకు నచ్చిన డిజైన్,నచ్చిన రంగులతో తీర్చిదిద్దింది.ఇంతలో అమెరికా నుండి మరదలు వచ్చింది.గొప్పగా తను పెయింటింగ్ వేశానని నల్ల చీర పెట్టవచ్చో లేదో అనే ఆలోచన లేకుండా ఎంతో ప్రేమతో మరదలికి బొట్టుపెట్టి నల్ల చీర ఇచ్చింది.బొట్టు పెట్టి నల్లచీర ఎవరికీ పెట్టగూడదన్న విషయం తెలిసినా పట్టించుకోకుండా తనైతే తీసుకోదు కానీ ఎదుటివాళ్ళ దగ్గర అవేమీ ఆలోచించదు.ఇది జరిగి మూడేళ్ళు అయింది.మాలతీ నాన్నను కొడుకు,కోడలు కొద్దిరోజులు వాళ్ళింటికి తీసుకెళ్ళారు.అప్పుడు ఏదో మాటమీద నల్లచీర విషయం వచ్చింది.మీ కూతురుకు నల్లచీర పెట్టకూడదు అని తెలియదా?ఏమీ అనలేక ఇష్టం లేకపోయినా తీసుకున్నాను అంది.తనకు తెలియదేమో అంటే పెళ్లీడు కొచ్చిన ఇద్దరు పిల్లలు ఉండగా ఆమాత్రం తెలియదా?చిన్నదాన్ని నాకే తెలియగా లేనిది అని మామను తెగ సతాయించింది.మామకు విసుగు వచ్చిఆ చీర ఇవ్వు నాకూతురుకే ఇచ్చేస్తాను అని తెచ్చి కూతురికి ఇచ్చాడు.ఇక మీదట నల్లచీర ఎవరికీ పెట్టకు తల్లీ!అని చెప్పాడు.
No comments:
Post a Comment