జానకి ఒక కుక్క పిల్లను తెచ్చి ముద్దుగా డున్నూఅని పేరు పెట్టింది.జానకి వాళ్ళు శాకాహారులు.డున్నూ చిన్నప్పటి నుండి వీళ్ళఇంట్లో పెరగటంవల్ల అది స్వచ్చమైన శాకాహారిగా తయారైంది.ఒకరోజు జానకి స్నేహితురాలు మాంసాహారం తెచ్చి డున్నూ ముందు పెట్టింది.అప్పుడు డున్నూకు విపరీతమైన కోపమొచ్చి ఆమె మీదపడి కరిచినంత పని చేసింది.ఆమె బతుకుజీవుడా!అనుకుంటూ పరుగెత్తింది.అప్పటినుండి దానికి ఎవరూ మాంసాహారం పెడదామని ప్రయత్నం చేయరు. ఇంకొకసారి జానకి భర్త బయటి నుండి ఆహారపదార్ధాలు తెప్పిస్తే పొరపాటున రెస్టారెంట్ వాళ్ళు మాంసాహార పదార్ధం ఒకటి ఇచ్చారు.వీళ్ళు చూడకముందే డున్నూ వెళ్ళి ఆ కవరు లాగేసి దూరంగా పడేసింది.ఏమిటి?ఇలా ప్రవర్తిస్తుందనుకుని చూస్తే అది మాంసాహారం.జానకికి అసలే చాదస్తం పాళ్ళు ఎక్కువ.ఇది ఈరోజు నన్ను కాపాడింది.లేకపోతే మాంసాహారం ముట్టుకోవాల్సి వచ్చేదనుకుని వాటిని బయట పారేయించి ఇల్లంతా శుద్ధి చేసుకుంది.
స్వచ్చమైన వార్తలు తెలుసుకొవటానికి చదవండి Spice Andhra News
ReplyDelete