చిత్ర ఇంటి దగ్గరలో ఏడుఏళ్ల రాహుల్ ఇల్లు ఉంది. .ముద్దుగా బొద్దుగా,తెల్లగా ఉంటాడు.ఆరోజు ఉదయం రోడ్డు మీద ఆడుకుంటుంటే చిత్ర చూసింది.సాయంత్రం కళాశాల నుండి ఇంటికి వచ్చేటప్పటికి రాహుల్ ఇంటి ముందు చాలామంది ఉన్నారు.కొంతమంది కంటతడి పెడుతున్నారు.ఇంటికి వచ్చి అమ్మా!రాహుల్ ఇంటిముందు అంతమంది ఉన్నారు ఏమైంది?అని అడిగింది.రాహుల్ చనిపోయాడు అని చెప్పింది.అదేంటి?ఉదయం బాగానే ఉన్నాడు కదా!అంది చిత్ర.గిన్నెలు తోముకునే ఊక బూడిద తింటున్నాడని వాళ్ళ అమ్మ ఒకదెబ్బ వేసిందట.నోటి నిండా పోసుకున్నాడేమో?కోరింత దగ్గు ఉందట.గుక్క తిప్పుకోలేక అప్పటికప్పుడు గద్ద కోడిపిల్లను తన్నుకెళ్ళినట్లుగా ప్రాణం పోయింది అంది.నింద లేనిదే బొంది పోదు అన్నట్లుగా నువ్వు ఒకదెబ్బ వెయ్యటం వల్లే చనిపోయాడని అందరూ తలా ఒక మాట రాహుల్ అమ్మను తిట్టడం మొదలెట్టారు.పిల్లడు పోయిన బాధలో ఆమె ఉంటే కాకులు పొడిచినట్లు జనం పొడుస్తున్నారు అని చిత్ర అమ్మ చెప్పింది.
No comments:
Post a Comment