Friday 17 October 2014

పిల్లిలా....

                             ఒకరోజు ప్రగ్య వంటగదిలో బిజీగా ఉంది.అకస్మాత్తుగా వెనుకనుండి అత్తా ఏమి చేస్తున్నావు?అంటూ వినిపించేసరికి వెనక్కు తిరిగింది.ప్రగ్య మేనల్లుడు నిలబడి ఉన్నాడు.ఇదేమిటి?ముందు తలుపు వేసి ఉందికదా తీసేటప్పుడు కొంచెమైనా శబ్దం రాలేదు అనుకుంది.పిల్లి ఎవరూ చూడకుండా దొంగతనంగా పాలు త్రాగటానికి నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ ఏశబ్దము లేకుండా వచ్చినట్లుగా పిల్లిలా వచ్చాడు.తలుపు కొట్టి రావటము లేకపోతే బెల్ నొక్కి రావటము సంస్కారం.అంతేకానీ అలా రావటం ఏమి పద్ధతి.సమయానికి పనిమనిషి ఉంది.ఆమెకూడా ఈయన బెల్ కొట్టకుండా నేరుగా ఇంటిలోపలకు వస్తున్నాడేమిటబ్బా?అనుకుని వెళ్ళేటప్పుడు అమ్మా! తలుపు లోపల బోల్ట్ వేసుకోండి ఎవరుపడితే వాళ్ళు వస్తే కష్టం కదా ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోవద్దమ్మా రోజులు బాగాలేవు అందుకని పెద్దదానిగా చెప్తున్నాను అనిచెప్పి వెళ్ళింది.మాకూ అన్ని పద్దతులు తెలుసు అని చెప్తాడు.ఆమెకున్నపాటి సంస్కారం కూడా లేదు.చదువుకుని కూడా సంస్కారం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. 

2 comments:

  1. ప్రగ్య కాదు ప్రజ్ఞ

    ReplyDelete
    Replies
    1. పేర్లు ఎవరికి నచ్చిన పేరు వాళ్ళు పెట్టుకోవచ్చు.నేను పెట్టిన పేరు ప్రగ్య.ప్రజ్ఞ ఇంతకుముందు పోస్ట్ లోనే ఉపయోగించాను.క్రొత్తపేర్లు తయారు చేసుకోవడం మొదటినుండి అలవాటు.ఏది ఏమైనా తప్పుగా వ్రాశానేమోనని సరిచేద్దామనుకున్నందుకు ధన్యవాదములు.

      Delete