Monday 1 December 2014

వేపకాయంత వెర్రి

                               వనజాక్షికి వేపకాయంత వెర్రి ఉంది.వాళ్ళింట్లో పనిచేసే వాళ్ళను ఇంకెక్కడా పని చేయనివ్వదు.
వేరే పనివాళ్ళతో మాట్లాడనివ్వదు.పోనీ తగినంత జీతం ఇస్తుందా అంటే ఇవ్వదు.వేరేవాళ్ళ ఇంట్లో పనిచేస్తే నీకు నీరసం వస్తుంది.మాఇంట్లో పనిచేసే శక్తి ఉండదు అందుకని ఎక్కడా పని చేయవద్దు అని వాళ్ళ గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నట్లుగా మాట్లాడుతుంది.ఆమె మనుమరాలికి కూడా కొడుకు పుట్టి జేజమ్మ అయినా ఎవరైనా పిన్ని, ఆంటీ,అమ్మమ్మ అని అన్నారంటే వాళ్ళ పని అయిపోయినట్లే.పెద్ద తగువు పెట్టుకుంటుంది.నన్ను ఆంటీ,అమ్మమ్మ అనటమేమిటి? పిల్లలైనా వనజాక్షీ అని పేరు పెట్టి పిలవాలి కానీ అని పెద్ద నోరు పెట్టుకుని అరుస్తుంటుంది. ఆమె నోటికి దడిచి ఎవరూ ఆమె జోలికి వెళ్లరు.ఆమె అంతట ఆమె మాట్లాడితేనే ఆచితూచి మాట్లాడతారు. 

No comments:

Post a Comment