రామసుందర్,సోమసుందర్ అన్నదమ్ములు.రామసుందర్ అన్నయ్య సోమసుందర్.
రామసుందర్ కి స్వార్ధం పాళ్ళు ఎక్కువ.ప్రతిచిన్న విషయానికి అన్నను అనుసరిస్తూ ఉంటాడు.ఎందుకంటే అన్న
రామసుందర్ కి స్వార్ధం పాళ్ళు ఎక్కువ.ప్రతిచిన్న విషయానికి అన్నను అనుసరిస్తూ ఉంటాడు.ఎందుకంటే అన్న
కన్నా తను,తన కుటుంబమే పైచేయిగా ఉండాలని దుర్భుద్ధితో ఆవిధంగా చేస్తుంటాడు.అన్న పిల్లలు ఏమి చదివితే తన పిల్లలు కూడా అదే చదవాలనుకుంటాడు.అంతే తప్ప తనకంటూ ఒక ప్రణాళిక ఉండదు.తన పిల్లలు అసలు చదవగలరా?లేదా?అనే ఆలోచన ఉండదు.గుడ్డిగా అనుసరిస్తాడు.చదవటమో,ఊరుకోవటమో అన్నది తర్వాత విషయం.సోమసుందర్ ఇలాటి విషయాలేమీ పట్టించుకోడు.తనపని ఏదో తను చేసుకోవటం తప్ప.వీళ్ళింట్లో ఏ నగ,వస్తువు కొంటే అది తర్వాతి రోజు వాళ్ళింట్లో ఉండాల్సిందే.ఎవరైనా మనల్ని అనుసరిస్తున్నారంటే సంతోషమే కానీ ప్రతి చిన్న విషయానికీ అనుకరించటమంటే మహా చెడ్డ చిరాకు.అన్నను అనుకరిస్తున్నట్లు తెలియకుండా తనే క్రొత్తగా చేసినట్లుగా వెధవ బిల్డప్పులు ఇస్తుంటాడు.ఇలా ప్రతిదీ కాపీ కొట్టడంతో సోమసుందరానికి విసుగుతో కూడిన కోపమొచ్చింది.ఏరా నీకు ఎన్నిసార్లు చెప్పిన ప్రయోజనం లేకుండా ప్రయోజనం లేకుండా పోయింది.ఈవిధంగా కార్బన్ పేపరులాగా కాపీ కొట్టడం మంచి పద్ధతి కాదు.స్వతంత్రంగా ఏపనైనా నీకు చేతనైనట్లుగా చేసుకోవటం నేర్చుకో నన్ను,మరెవరినైనా అనుకరించటం మానుకోమని హితవు చెప్పాడు.
No comments:
Post a Comment