రోజూ ఉదయం,సాయంత్రం నీరెండలో పచ్చటి చెట్లమద్య నడవటం,తోటపని చేయడం
చక్కటి వ్యాయామం.పచ్చటి చెట్ల మధ్య గడపటం వల్ల మనసు కెంతో ప్రశాంతంగా ఉండటమే కాక,ఉదయం సాయంత్రం నీరెండలో పని చేయటం వల్ల శరీరానికి విటమిన్ "డి" లభిస్తుంది.దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.స్వచ్చమైనగాలి,ప్రశాంతమైన వాతావరణంలో ఏకాగ్రత కూడా పెరుగుతుంది.అదీకాకమొక్కలకు నీళ్ళు పట్టటం,ఎండిన ఆకులు తీసేయడం,ఎప్పటికప్పుడు మొక్కలను కత్తిరించడంవంటి పనులు చేయటం వల్ల కాలొరీలు ఖర్చయి అధిక బరువు తగ్గుతారు. మనం పెంచుకున్న మొక్కలు,చెట్లు పువ్వులు పండ్లు ఇస్తే మనకు ఎంతో సంతోషం కలుగుతుంది.సంతోషమే సగం బలం.సంతోషంగా ఉంటూ ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా ఉంటే ఎటువంటి అనారోగ్యాలు దరిచేరవు.
No comments:
Post a Comment