Thursday 25 December 2014

ఆరాలగత్తె

                              జయంతికి ఆరాలు తీయటం వెన్నతో పెట్టిన విద్య.ప్రక్కింటి విషయాలు,ఎదురింటి విషయాలు,
అన్నీ ఈమెకే కావాలి.మళ్ళీ అవితీసుకెళ్ళి కనిపించిన వాళ్లకల్లా చెప్పనిదే హాయిగా నిద్ర పట్టదు.ఒకరోజు ఎదురింటికి క్రొత్తగా ఒక ఫ్యామిలీ వచ్చింది.పది సంవత్సరాల క్రితం కొద్దిపాటి ముఖ పరిచయం.వాళ్ళింటికి వెళ్ళి మీకెంత పొలం ఉంది?అది ఎంత రేటు చేస్తుంది?మీ వారేమి చేస్తున్నారు?మీపిల్లలు ఏమి చదువుతున్నారు?ఎన్నో యక్ష ప్రశ్నలు వేసి ఒక గంట సమయం వృధా చేసింది.ఈమె సంగతి తెలుసు కనుక వాళ్ళు వివరాలు ఏమీ చెప్పలేదనుకోండి అది వేరే విషయం.మళ్ళీ ఇంటికి వెళ్ళకుండా వేరే ఇంటికి వెళ్ళింది.వాళ్ళు మాకూ బాగా తెలుసు వాళ్ళఇంటివిషయాలన్నీ  నాకు తెలుసుఅని నోటికి వచ్చినట్లు ఏకరువు పెట్టుద్దన్న మాట.అందరి ఇళ్ళకు వెళ్ళి తన పిల్లలు గొప్పవాళ్ళని చెప్పుకోవటం అలవాటయిపోయింది.అమ్మో ఆరాలగత్తె వస్తుంది.ఈమెతో జాగ్రత్తగా ఉండాలి అని కొంతమంది పని 
 ఉన్నట్లు తప్పుకుంటారు.తప్పించుకోవటానికి వీలుపడని వాళ్ళుఆమె వాగ్ధాటికి బలైపోతుంటారు.   

No comments:

Post a Comment