Saturday 13 December 2014

టన్ను బరువు

                                                మాన్య ఈమధ్యనే ఇల్లు కట్టుకుని క్రొత్త ఇంట్లోకి వచ్చింది.ఇంటినిండా ఎక్కడనుండి  వస్తున్నాయో కానీ ఎటు చూసినా అన్నీ నల్లచీమలే.ఏవస్తువు పెట్టినా నిమిషాల్లో చుట్టుముట్టేస్తున్నాయి.తీపి వస్తువులైతే సెకన్లలో వచ్చేస్తాయి.ఈచీమలేంటో విచిత్రంగా కాళ్ళు పైకి లేపి వేగంగా నడుస్తున్నాయి.మాన్య తులసి మొక్కకు పూజచేసి మిశ్రీబిళ్ళలు అంటే పటికబెల్లం చిప్స్ పెట్టడం అలవాటు.పెట్టినవి నిమిషాల్లో మాయమై పోతున్నాయి.ఖాళీ ప్లేటు ఉంటుంది.ఇది ఎలా సాధ్యం?అని ఒకరోజు అక్కడే కూర్చుంది.తన ముందే చీమల దండు లాగా వచ్చి4,5చీమలు కలిసి ఒక్కొక్క బిళ్ళను టన్ను బరువు లాగుతున్నట్లుగా వేగంగా లాక్కెళ్ళి ఒక్కొక్కదాన్ని నీళ్ళు వెళ్ళటానికి పెట్టిన రంద్రంలో భద్రపరిచినాయి.వాటిని చూస్తే మాన్యకు ముచ్చటేసింది.అంత చిన్న చీమలు అంతపెద్ద బిళ్ళను తమ శక్తికి మించి మోసుకెళ్ళి ముందుచూపుతో దాచుకున్నాయంటే మనం వాటిని చూచి నేర్చుకోవాల్సిన పాఠం చాలా ఉందనిపించింది.రూపాయి ఉంటే ఏదో ఒకటి అవసరం లేకపోయినా అనవసరంగా కొని ఖర్చుపెట్టేస్తాం.వాటిలాగా పూర్తిగా కాకపోయినా కొంతైనా పొదుపుగా దాచుకుంటే భవిష్యత్తులో కొన్ని మంచిపనులు చేయటానికి ఉపయోగపడతాయని అనిపించింది..  

No comments:

Post a Comment