Tuesday, 2 December 2014

ఏమో అక్కా

                                            రూపాలీ ఇంట్లో చిన్నాచితక పనులు చేయటానికి ఒక కుర్రాడు ఉంటాడు.ఒక అరగంట ఏదైనా పని చేస్తే 2 గం.లు మళ్ళీ కనిపించడు.అత్యవసరమై ఏదైనా చెయ్యాలన్నా పిలిచినా ఉలకడు పలకడు.పోనీ వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళావు? అని అడిగితే సమాధానం చెప్పడు.ఒకరోజు రూపాలీ కూతురు ఇంద్రనీల పుస్తకము అవసరమై కొట్టు నుండి తెప్పించుకుందామంటే 2 గంటలైనా ఇంటికి రాలేదు ఇంద్రనీలది ఉడుకు రక్తం కదా వాడికోసం 2 గంటలు ఎదురుచూచి విసుగొచ్చి వాడు రాగానే అరవటం మొదలుపెట్టింది.ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు?అంటే సమాధానం చెప్పలేదు.ఆపిల్లకు పిచ్చి కోపమొచ్చి నేను ఇక్కడెందుకు కూర్చున్నాననుకున్నావు ?
పిచ్చెక్కి కూర్చున్నాననుకున్నావా?అనేసరికి ఏమో అక్కా !నాకు తెలియదు అన్నాడు?ఇంద్ర నీల తెల్లబోయి అంటే  పిచ్చెక్కిందేమో అనేకదా అర్ధం.మరీ ఆటగా ఉంది నీకు అనేసరికి సిగ్గుపడి ఒక్కసారి పెద్దగా నవ్వేశాడు.అంతకన్నా   చేసేదేముంది వాడితోపాటు అందరూ నవ్వేశారు.










No comments:

Post a Comment