శీతాకాలంలో సాయంత్రం వేడివేడిగా సూప్ తయారుచేసుకుని త్రాగితే బాగుంటుంది.దీనిలో మిరియాలపొడి వేస్తాం కనుక చలిలో కఫం పేరుకోకుండా ఉంటుంది.ఎప్పుడూ ఒకేరకం ప్రయత్నించే కన్నా
ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం చేసుకుంటే అన్నిరకాల పోషకాలు శరీరానికి అందుతాయి.సరే,జొన్న సూప్ కి ఏమేమి కావాలో,ఎలా తయారు చేయాలో చూద్దామా?
జొన్నపిండి - 100 గ్రా.
పాలకూర - 1 కట్ట
బాదం పప్పు- 10 గ్రా.
పెసర పప్పు - 20 గ్రా.
మిరియాలపొడి - తగినంత
ఉప్పు - తగినంత
నీళ్ళు - 3/4 లీ.
పాలకూరను ఉడికించి మిక్సీలో వేసుకోవాలి.బాదం,పెసరపప్పు పొడి చేయాలి.ఒక గిన్నెలో పాలకూర రసం.బాదం,పెసరపొడులను జొన్నపిండి,తగినంత నీళ్ళు పోసి కలిపి మరిగించాలి.
3 పొంగులు రానిచ్చి ఉప్పు,మిరియాల పొడి వేసి బౌల్ లోకి తీసుకోవాలి.పైన కొంచెం కొత్తిమీర అలంకరించి సర్వ్ చెయ్యాలి. అంతే జొన్న సూప్ రెడీ.ఇది చాల రుచికర మైనది,బలవర్ధక మైనది.

No comments:
Post a Comment