Tuesday 16 December 2014

భూమ్మీద నూకలుండి బ్రతకటం

                             యశోధర్ గారు పెద్ద పేరుమోసిన వైద్యుడు.డెబ్బై సవత్సరాల వయసులో కూడా ఎంతో చలాకీగా ఉంటారు.ఆయన హస్తవాసి అంటే ఉన్న నమ్మకంతో ఇప్పటికీ ఆయన ఆసుపత్రి కిటకిటలాడి పోతుంటుంది.ఒకరోజు స్నేహితుడిని పరామర్శించటానికి వెళ్ళి నిర్మానుష్యంగా ఉన్న దారి నుండి వస్తున్నప్పుడు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు.ముందు మాములుదే అనుకున్నాఅధిక చెమటలు పట్టేసరికి గుండె నొప్పి లక్షణాలని అర్ధం చేసుకుని
వెంటనే ఆసుపత్రికి ఫోనుచేసి వాహనాన్ని పంపమని కారులోనే పడుకున్నారు.ఇంతలో ఎవరో అటుగా వెళ్తుంటే సొమ్మసిల్లకుండా నీళ్ళు అడిగి త్రాగారు.అడపాదడపా తప్ప ఆదారిలో వాహనాలు కూడా రావు.వెంటనే ఫోను చేసినా రోగుల్ని తీసుకెళ్ళే వాహనం రావటానికి గంట పట్టింది.ఆసుపత్రికి వెళ్లేసరికి ఒక్క 5 ని.లు ఆలస్యమైతే వైద్యులు వెళ్ళి పోయేవాళ్ళు.వెంటనే పరీక్షలన్నీ చేసి అత్యవసరంగా గుండెకు వెళ్ళే రక్తనాళం మూసుకుపోయిందని ఆపరేషను చేయటంవల్ల బ్రతికారు.5 రోజుల తర్వాత మళ్ళీ ఇంకోసారి తీవ్ర గుండెనొప్పి వచ్చింది.మళ్ళీ ఇంకోసారి సర్జరీ చేయవలసి వచ్చింది.ఇంతకీ ఆయనకు ముందస్తుగా ఏ లక్షణాలు బయటపడలేదు.అదీ ఆయన వైద్యుడు కనుక తీవ్ర గుండేనొప్పి అని తెలుసుకోగలిగారు.సామాన్యులు అది తెలుసుకోలేరు కనుక చనిపోయేవాళ్ళు.ఆరోగ్యంగా ఉన్నా ప్రతి సంవత్సరం ఆరోగ్యపరీక్షలు చేయించుకోవటం తప్ప వేరే దారిలేదు.ఎంత వైద్యులైనా 5 ని.లు ఆలస్యమైనా  ప్రాణం పోయేది.ఆయనకు భూమ్మీద ఇంకా నూకలుండి సమయానికి వైద్యం అంది బ్రతకటం జరిగింది.      

No comments:

Post a Comment