పిల్లలు ఇడ్లీ తినటానికి ఇష్టపడరు.ఈవిషయంలో నిర్మొహమాటంగా వద్దు అని చెప్పేస్తుం టారు.
అందుకే కొన్నిరకాల ఇడ్లీలు ఎలా చేయాలో తెలుసుకుందాము.మామూలు ఇడ్లీ అయితే మినప్పప్పు- 1,ఇడ్లీరవ్వ-2
వేస్తాము.ఈపిండి తోనే రకరకాలు చెయ్యొచ్చు.అదెలాగంటే మామూలు గానే ఇడ్లీ వండేయాలి.
1)ఇడ్లీని చిన్నచిన్న ముక్కలుగా చేసి ఒక ప్రక్కన పెట్టుకోవాలి.స్టవ్ మీద బాండీ పెట్టి కొంచెం నెయ్యి వేసి ఉప్పు,సంబారుకారం(ఇంత ముందు పోస్ట్ లో ఎలా చేసుకోవాలో ఉంది) వేసి ఇడ్లీ ముక్కలు వేసి వేయించాలి.
2)మనకు అవసరమైనన్ని ఇడ్లీలను చిన్నగా చేతితో పొడిగా చేయాలి.స్టవ్ మీద బాండీ పెట్టి నూనె వేసి తాలింపు వేసి ఉల్లిపాయముక్కలు,పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా వేయించి కారట్ తురుమువేసి 2 ని.లు వేయించి ఇడ్లీలు పొడి వేసి సరిపడా ఉప్పు వేసి ,కొద్దిగా నిమ్మరసం కలపాలి.నిమ్మరసం నచ్చకపోతే ఉల్లి ముక్కలతోపాటు,టొమాటో ముక్కలు వేసుకోవచ్చు.ఇడ్లీ ఉప్మా రెడీ.
3 )ఇడ్లీ పిండిలో ఉల్లిపాయ ముక్కలు,పచ్చి మిర్చి,కొత్తిమీర తరుగు కలిపి ఇడ్లీ వేస్తే కొత్తిమీర ఇడ్లీ తయారౌతుంది.
4)ఇడ్లీ పిండిలో కారట్ తురుము వేసి ఇడ్లీ వేస్తే కారట్ ఇడ్లీ రెడీ.
5)చిన్నపిల్లలకు కొద్దిగా పంచదార,నెయ్యి అద్ది పెట్టవచ్చు.
6)కొద్దిగా సంబారు కారం,వేడి నెయ్యి కలిపి వేడిగా ఇడ్లీ తింటే చాల రుచిగా ఉంటుంది.
7)ఇవే కాక 1- మినప్పప్పు,2 - జొన్నరవ్వ వేసి జొన్నరవ్వ ఇడ్లీ వెయ్యవచ్చు.మినప్పప్పు 4 గా లు నానబెట్టి మిక్సీలో వేసి రుబ్బి పిండిలో 10 ని.లు నానబెట్టి కడిగిన జొన్నరవ్వను కలిపి రాత్రిపూట పులవనిచ్చి ఉదయం ఇడ్లీ పిండి మాదిరిగానే ఇడ్లీ వేసుకుని వేడిగా మన ఇష్టం వచ్చిన చట్నీతో తినవచ్చు.
చిట్కా :ఇడ్లీ పిండి మిగిలితే వృధాగా పడేయకుండా కొంచెం మైదా కలిపి ఉల్లిపాయ,పచ్చిమిర్చి వేసి నూనెలో పునుగులు వేసుకుంటే మెత్తగా,రుచిగా ఉంటాయి.ఇష్టమైతే కొంచే బొంబాయి రవ్వ వేస్తే కరకరలాడుతాయి.
0

No comments:
Post a Comment