శ్రీహర్ష ఐషర్ అనే కుక్కపిల్లను పెంచుకుంటున్నాడు.శ్రీహర్ష ఇల్లంతా దాని సామ్రాజ్యమేనని అనుకుంటుంది.అందుకని ప్రహరీ లోపలకు ఏజీవిని రానివ్వదు.ఒక రోజు ఉదయం తలుపు తెరిచేటప్పటికి ఎలా వచ్చిందో తెలియదు కానీ ఊర కుక్కపిల్ల ఒకటి వరండాలోకొచ్చి పడుకుంది.దాన్ని చూచి ఐషర్ ఒకటే అరవటం మొదలెట్టింది.పాపం దాని కాలికి దెబ్బ తగలటం వలన అది కదలలేక పోయింది.కొంచెసేపు అరిచిన తర్వాత ఆ విషయం ఐషర్ అర్ధం చేసుకుంది.అప్పటి నుండి కుక్కపిల్ల మీద జాలిపడి ,దానికి పెట్టిన ఆహారం,పాలు పెట్టిన గిన్నెలను మూతితో తోసుకువచ్చి దాన్నితినమని మూతి దగ్గరకు నెట్టటం మొదలెట్టింది. దెబ్బ తగిలిన ఊర కుక్కపిల్ల మనదగ్గర ఎందుకని శ్రీహర్ష దూరంగా వదిలి పెట్టించాడు.ఆ రోజంత ఐషర్ ఇంటి చుట్టూ తిరిగి కుక్కపిల్ల కనిపించలేదని దిగులుగా కూర్చుంది.ఇంతలో సాయంత్రం శ్రీహర్ష ఉద్యోగం నుండి ఇంటికి వచ్చాడు.వచ్చీ రాగానే శ్రీహర్షను గుమ్మం దగ్గరే నిలబెట్టి ఐషర్ అరవటం మొదలెట్టింది.మొదట శ్రీహర్షకు అర్ధం కాలేదు.తర్వాత అర్ధమైంది.నువ్వే కుక్కపిల్లను తీసుకెళ్ళి వదిలేశావు నేను ఆ విషయం కనిపెట్టాశానోచ్ !అన్నట్లుగా పోట్లాడటం మొదలెట్టింది.దాన్నిదాని తల్లిదగ్గరకి పంపేశాను అని బుజ్జగించిన తర్వాత కానీ అది అరవటం మానలేదు.
No comments:
Post a Comment