పుల్లని మామిడికాయ -1
బియ్యం -1/4కే.జి
పెసరపప్పు-1/2కే.జి
ఉల్లిపాయలు -4
పచ్చిమిర్చి -5
అల్లం -చిన్నముక్క
జీర(జీలకర్ర)-కొంచెం
ఉప్పు -తగినంత
నూనె -దోసెలకు సరిపడా
ముందుగా బియ్యం,పెసరపప్పు కలిపి నానబెట్టి,నానినతర్వాత మిక్సీలోవేసి మామిడికాయముక్కలను చేర్చి మెత్తగా రుబ్బినతర్వాత పచ్చిమిర్చి,జీర,ఉప్పు,అల్లంవేసి రుబ్బాలి.
మామూలు దోసెలు లాగానే పలుచగా వేసుకుని పైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి.
కొబ్బరి చట్నీకానీ,అల్లం,పచ్చిమిర్చి చట్నీతోగానీ తింటే చాలా రుచిగా ఉంటాయి.
No comments:
Post a Comment