కొబ్బరికాయలు - 2
పాలు - 1/2 లీటరు
బియ్యప్పిండి - 1/2 కే .జి
పంచదార - 1 కప్పు
బెల్లం - 3/4 కే.జి
నూనె - వేయించటానికి సరిపడా
కొబ్బరి తురుముకుని,బెల్లం తరిగి రెండు కలిపి ఒక మందపాటి గిన్నెలో వేసి 1/2కప్పు నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి లౌజు తయారు చేసుకోవాలి.అంటే బర్ఫీ అయ్యేకన్నా కాస్త ముందుగా దింపి చల్లారక నిమ్మకాయంత ఉండలు చేసుకోవాలి.వేరేపాత్రలో పాలు,పంచదార వేసి కలిపి స్టవ్ మీద పెట్టి బియ్యప్పిండి పోస్తూ త్రిప్పాలి.గట్టిపడిన తర్వాత 2 స్పూనుల నెయ్యివేసి ఉండలు లేకుండా కలిపి దించాలి.చల్లారాక పెద్ద నిమ్మకాయంత ఉండ తీసుకుని చేతికి నూనె రాసుకుని పలుచగా వత్తి మధ్యలో కొబ్బరి ఉండ పెట్టి చుట్టూ ముయ్యాలి.అన్నీ అలాగే చేసి పెట్టుకుని బాండీలో నూనె పోసి కాగాక నాలుగైదు ఉండలు చొప్పున వేసి మీడియం ఫ్లేమ్ మీద వేయించి తియ్యాలి.కొంచెం ఆరిన తర్వాత ఒక డబ్బాలో వేస్తే నాలుగు రోజులు నిల్వ ఉంటాయి.కంటికి ఇంపుగాను,నోటికి రుచిగానూ,కడుపు నిండే తేలికైన వంటకం.

No comments:
Post a Comment