మైదా - 1/2 కే .జి
వెన్న - 200 గ్రా.
బెల్లం - 1/4 కే. జి
నూనె - వేయించటానికి సరిపడా
మైదా జల్లించి ఒక గిన్నెలో వెయ్యాలి.వెన్న కొంచెం కరిగించి మైదాలో వెయ్యాలి.(వెన్న డైరెక్ట్ గా కలిపితే ఎక్కడైనా చిన్న గడ్డలుగా ఉండి నూనెలో వేసినప్పుడు పేలతాయి.అందుకని కొంచెం కరిగించాలి.)బెల్లం కొంచెం నీళ్ళుపోసి కరిగించి వడకట్టాలి.మైదా,వెన్న,నీళ్ళు కలిపి గట్టిగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి.పల్చటి క్లాత్ తడిపి పిండిపై వెయ్యాలి.ఒక అరగంట తర్వాత ఒకసారి పిండిని మర్దనచేసి చిన్నచిన్న ఉండలు చెయ్యాలి.బాండీలో నూనె పోసి కాగిన తర్వాత కొన్నికొన్ని వేసి కరకరలాడేలా వేయించుకోవాలి.ఈలోపు బెల్లం పాకం పట్టాలి.చిన్న ప్లేటులో
నీళ్ళు పోసి ఉడుకుతున్న పాకం నీళ్ళల్లో వేస్తే దగ్గరకు వచ్చినప్పుడు వేయించిన ఉండలు వేసి త్రిప్పాలి. నాలుగైదుసార్లు త్రిప్పి ఒక పెద్ద ప్లేటులో పోసి వేడి తగ్గేవరకూఆరనివ్వాలి.నోరూరించే రుచికరమైన వెన్న ఉండలు రెడీ.ఇవి వారంరోజులు నిల్వ ఉంటాయి.పిల్లలు,పెద్దవాళ్ళు కూడా ఇష్టపడే వంటకం.

No comments:
Post a Comment