పాలు - 1 లీటరు
బెల్లం 1/2 కే.జి
బియ్యప్పిండి - 2 కప్పులు
యాలకులు - 6
సగ్గుబియ్యం - 1/2 కప్పు
జీడిపప్పు,కిస్ మిస్ - మన ఇష్టం
కొద్దిగా పిండితో కొట్ర కాచి (కొంచెం నీళ్ళు మరిగించి దానిలో కొద్దిగా బియ్యప్పిండి వేసి త్రిప్పి పలుచగా చేసేదాన్ని కొట్ర అంటారు)బియ్యప్పిండిలో బెల్లం కొద్దిగా వేసి పిండి కలిపి జంతికల గిద్దలతో
చుట్లు మరిగే పాలల్లో వెయ్యాలి.కాసేపు కదపకుండా అడుగునుండి వెడల్పు గరిటెతో కదపాలి.పాలల్లో సగ్గుబియ్యం కూడా వేసి ఉడికించాలి.బెల్లం చిక్కగా పాకం పట్టి చివరలో కలపాలి.యాలకుపొడి,నేతిలోవేయించిన జీడిపప్పు,కిస్ మిస్ వేయాలి.గరిటెతోవేగంగా కదిపితే చిన్నముక్కలు అవుతాయి.పాల తాళికలు కొద్దిగా పొడవుగా ఉంటేనే చూడటానికి బాగుంటాయి. కనుక ఎక్కువసార్లు గరిటెతో త్రిప్పగూడదు.కొద్దిగా నెయ్యి వేసి చిక్కగా అయిన తర్వాత
స్టవ్ ఆపేసి దించాలి.నోరూరించే పాలతాళికలు రెడీ.
గమనిక : అడుగు మందంగా ఉన్న గిన్నెలోఒక్క పావుగ్లాసు నీళ్ళుపోసి చిక్కటి పాలు పోసి పాలతాళికలు చేస్తే
అడుగంటకుండా,రుచిగా ఉంటాయి.

No comments:
Post a Comment