అభిజ్ఞ కుటుంబం అమెరికాలో జరగనున్న మేనకోడలి వివాహానికి హాజరవటం కోసం వీసా కార్యాలయానికి వెళ్ళింది.అక్కడ ఒక పెద్దాయన చెరగని చిరునవ్వుతో అందరివైపు పలకరింపుగా చూస్తుంటే ఈయన్ని ఎక్కడో చూచినట్లు అనిపిస్తుంది అనుకుంది అభిజ్ఞ.సాదాసీదాగా,హుందాగా,ఏ హడావిడి లేకుండా, ప్రశాంతంగా అందరితోపాటు లైన్లో నిలబడి,లోపలికి వెళ్ళి తనవంతు వచ్చేవరకు ఎదురుచూచి అదే చెరగని చిరునవ్వుతో పని పూర్తియిన తర్వాత భార్యతో కలిసి వెళ్లారు.దీనంతటికి ఒక మూడుగంటల సమయం పట్టింది.ఇంతకీ ఆయన ఎవరంటే తమిళనాడు మాజీ గవర్నరు.ప్రక్కనే వన్న ఇంకొక పెద్దాయన ఆయన వెళ్ళిన తర్వాత ఈ విషయం చెప్పేసరికి ఔనా!ఎంత సాదాసీదాగా ఉన్నారు అని ఆశ్చర్యపోయారు.చిన్నచిన్నపదవుల్లో ఉన్నవాళ్ళే ఎంతో హడావిడి చేసే రోజులాయె.
No comments:
Post a Comment