సంజయ్ స్నేహితుడి కూతురు పెళ్ళికి వెళ్ళాడు.అక్కడ చదువుకున్నప్పటి స్నేహితులందరూ కలిశారు.భోజనం చేస్తుండగా సంజయ్ పెరుగు వేసుకుందామనుకునేసరికి ఒక స్నేహితుడు వేసుకోవద్దని ఆపేశాడు.పెరుగు రుచిగా,గడ్డలాగా తోడుకోవటానికి యూరియా కలుపుతున్నారని చెప్పాడు.నిజమా!అని మిగతావాళ్ళు ఆశ్చర్యపోయేసరికి చరవాణిలో దానికి సంబందించిన ఋజువు చూపించాడు.అవును, వాళ్లకు లాభాలే ముఖ్యం కానీ ప్రజల ఆరోగ్యం ముఖ్యం కాదు అని చెప్పాడు.ఈమధ్య పెరుగు రుచిగా ఉంటుందని నేను వేసుకుంటున్నాను అని ఇంకో స్నేహితుడు అన్నాడు.అయితే ఇదన్నమాట అసలు రహస్యం.తెలిసి అనారోగ్యం కొని తెచ్చుకోవటమెందుకని ఇకముందు ఎవరూ బయట తయారు చేసిన పెరుగు వేసుకోవద్దని అనుకున్నారు.
No comments:
Post a Comment