పాలు పొంగితే సంసారం బాగుంటుందని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు.రోజూ పాలు పెట్టినప్పుడల్లా పొంగితే పొంగిన ప్రతీసారీ స్టవ్ తుడుచుకోవాలన్నాచాలా ఇబ్బంది.పండుగలప్పుడు,ముఖ్యమైన సమయాలలో పాలు పత్యేకంగా పొంగిస్తాము కనుక రోజూ పాలు పొంగి గిన్నె చుట్టూ పడిపోకుండా పాలగిన్నెలో ఒక గరిటె వేసి పొయ్యి మీద పెడితే గిన్నెలోపైవరకు వచ్చినా అక్కడే మరుగుతుంటాయి కానీ చుట్టూ పడిపోవు.
No comments:
Post a Comment