సుజిత్ కుటుంబంలో అందరూ చదువుకున్నా వాళ్ళే.సుజిత్ ఒక్కడికే సరిగా చదువబ్బలేదు.ఏపనీ చేయకుండా తిని,తిరగటం నేర్చుకున్నాడు.ఎవరి మాట లెక్కచేయకుండా ఆరకంగా పనీ,పాటా లేకుండా తిరగటమేమిటి?అని ఎవరైనా అంటే ఒంటికాలి మీద పోట్లాటకు తయారయ్యేవాడు.ఒకరోజు మేనమామకు కోపం వచ్చి తాగాడి లాగా పెరిగితే సరిపోయిందా?చదువు అంటే ఇష్టం లేకపోతే నీకిష్టమైన పని చేసుకో.అంతేకానీ ఖాళీగా తిరిగితే అదే అలవాటయి ఏపనీ చేయబుద్దికాదు.ఈరోజుల్లో వయసు మీద పడిన వాళ్ళు కూడా తిని కూర్చోవటం లేదు.ఇంత చిన్నవయసులో అసలు ఇలా ఉండకూడదు.హుషారుగా ఉండాలని పదేపదే చెప్పగా నాకు వ్యాపారం చేయాలనీ ఉందని,ఇంత చిన్నవయసులో వ్యాపారం ఎందుకు?చదువుకోమని తల్లిదండ్రులు అంటున్నారని చెప్పాడు.సరే నువ్వు ఏవ్యాపారం చేద్దామని అనునుకుంటున్నావో దాని గురించి లోటుపాట్లు అన్నీ కూలంకషంగా తెలుసుకుని అప్పుడు మొదలు పెట్టుకో.అప్పుడు ఎవరికీ అభ్యంతరం ఉండదు అని సుజిత్ కి నచ్చచేప్పేసరికి మేనమామకు తల ప్రాణం తోకకు వచ్చినంత పనయ్యింది.
No comments:
Post a Comment