అభీష్ట తాతగారు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ప్రకాశరావు గారిని మాట్లాడుతున్నాను అంటూ చెప్పేవారు.అదేమిటి?తాతగారు భలే!తనను తానే గౌరవించుకుని గారు అని చెప్పుకుంటున్నారు అనుకునేవాళ్లు మనుమలు,మనుమరాళ్ళు.ఆయన తన అనుభవంతో అలా చెప్పేవారని ఇప్పుడు అర్ధమవుతోంది.మనల్ని గౌరవించడం ఎలాగో ఇతరులకు మనమే నేర్పాలి అన్నట్లుగా ఉంటుంది.ఇది వింతగా ఉన్నా నిజం.మనం మీరు అని మాట్లాడినా నువ్వు అనే కాలం ఇది.ముందు మనల్ని మనం గౌరవించుకోవటం నేర్చుకుంటే ఇతరులు మనల్ని గౌరవిస్తారు.ఎదుటివాళ్ళు ఏదైనా మాట్లాడినా నచ్చకపోయినా మొహమాటంగా ఊరుకుంటే అది తేలికగా ఏదిపడితే అది మాట్లాడటానికి ఆస్కారం ఇచ్చినట్లవుతుంది.అలా ఊరుకోకూడదు.ఉదాశీనత పనికి రాదు.అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలని శాస్త్రం.అందుకని మొదట్లోనే ఖండించాలి.
No comments:
Post a Comment