అన్వితకు పండ్లలో తర్భూజ అంటే అసలు ఇష్టం ఉండదు.అమ్మ ఎలాగయినా అన్వితకు ఆపండు తినటం అలవాటు చేయాలని ఒకరోజు కూర్చోబెట్టి తర్భూజ తినటం వలన ఎంత ఉపయోగమో చెప్పటం మొదలుపెట్టింది.తర్భూజలో ఎక్కువ నీటిశాతం,తక్కువ కెలోరీలు ఉంటాయి.అందువల్ల బరువు తగ్గుతారు.బరువు తగ్గాలంటే రాత్రిపూట తినాలి.వేసవిలో తింటే త్వరగా దాహం వేయదు.తక్షణ శక్తినిస్తుంది.గుండెకు ఎంతోమంచిది.రోజూ తింటే చర్మం నునుపుగా తయారౌతుంది.జుట్టు పెరుగుతుంది.రక్తంలో చక్కరశాతాన్ని అదుపు చేస్తుంది.కడుపులో మంట తగ్గిస్తుంది.అధిక రక్తస్రావాన్ని అదుపులో ఉంచుతుంది.పీచు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్దకం ఉండదు. ఇన్ని ప్రయోజనాలున్నప్పుడు తినటం మంచిది అని చెప్పి మొదటగా తినటం కనుక కొంచెం పంచదార వేసి ఇచ్చింది.అమ్మ చెప్పింది కనుక అన్విత మొదట అయిష్టంగానే తినటం మొదలుపెట్టింది కానీ తర్వాత రుచిగానే ఉందనిపించి క్రమంగా తినటం అలవాటు చేసుకుంది.ఇప్పుడు అన్వితకు తర్భూజ అంటే ఎంతో ఇష్టం.
No comments:
Post a Comment