వీళ్ళే కాక జమిందారుగారి దగ్గరకు 4,5 గురు మగపిల్లల తల్లిదండ్రులు వచ్చి అడిగితే మొదటివాళ్ళకు చెప్పిన సమాధానమే మిగతావాళ్ళకు చెప్పారు.నొప్పించక తానొవ్వక అన్నట్లుగా వచ్చిన అందరికీ
బాధ కలుగకుండా ఉండే విధంగా చక్కగా వివరించి చెప్పారు.
బాధ కలుగకుండా ఉండే విధంగా చక్కగా వివరించి చెప్పారు.
ఈలోపు మొదటగా కబురు పంపించిన ప్లీడరు తల్లిదండ్రులు కొడుకుకు నచ్చచెప్పి చుట్టాల్లో అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చేశారు.దురదృష్టవశాత్తు 5 సంవత్సరాల తర్వాత అనారోగ్యంతో ప్లీడరు భార్య చనిపోయింది.వీళ్ళకు పిల్లలు కూడా కలగలేదు.కూతురు చనిపోయిన దుఖంలో నుండి బయటపడటం కష్టంగా ఉండి అల్లుడిని వాళ్ళదగ్గరే ఉండాలని కోరటం వల్ల అత్తారింట్లో ఉండిపోయాడు.అత్త చెల్లెలి కూతుర్నిమాట్లాడి అల్లుడికి రెండవ పెళ్ళి చేశారు.కాలక్రమంలో ఇద్దరు పిల్లలు కలిగి బాగానే ఉన్నారు.చెల్లెలి కూతుర్లో తన కూతుర్ని చూచుకుని ఆపిల్లల ఆలనా పాలనా చూస్తూ అందరూ కలిసిమెలిసి ఉన్నారు.
(తరువాయి భాగం రేపటి పోస్టులో)
No comments:
Post a Comment