హాయిగా కంటినిండా ప్రశాంతంగా నిద్రపోతే ఒత్తిడికి గురికాకుండా ఆరోగ్యంగా ఉంటాము.సీత కష్టాలు సీతవి,పీత కష్టాలు పీతవి అని శాస్త్రం.సమస్యలులేని జీవితం అసాధ్యం.ప్రతిదీ భూతద్దంలో నుండి చూడకూడదు.ఏ సమస్య ఉన్నాపడకగది బయటే ఆలోచనలన్నీ వదిలేసి,పడుకునే ముందుప్రశాంతంగా ఉండటానికి నచ్చిన పుస్తకం చదువుకోవచ్చు.సంగీతం వినొచ్చు.ధ్యానం చేసుకోవచ్చు.హాయిగా నిద్రపడుతుంది. తద్వారా మెదడు చురుగ్గా పనిచేస్తుంది.కోపం,చికాకు తగ్గుతుంది.వ్యాధి నిరోధక శక్తి పెరిగి త్వరగా జలుబు,దగ్గు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.అధిక రక్తపోటు,అధికబరువు,గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.కంటి నిండా నిద్ర పోతే ఎన్ని లాభాలో?కదా!
No comments:
Post a Comment