ఆశకు హద్దు లేదు.ఆశపడటంలో తప్పులేదు కానీ అత్యాశ పడటం మంచిది కాదు.అది మనకు ఎదుటివారికి కూడా ఇబ్బంది కలిగిస్తుంది.ఇప్పుడు వాళ్ళ స్వార్ధం తప్ప ఎదుటివారి ఇబ్బంది గురించి చాలామంది ఆలోచించటంలేదు.ఆమె ఎవరో తెలియక రాణీ మాలినీ దేవిని పెళ్ళి చేసుకుందామని అనుకున్న ప్లీడరు ఆమె ఎవరో తెలిసి అది సాధ్యపడదని అర్ధం చేసుకుని పెళ్ళి చేసుకున్నాడు.గతం గతః అని వదిలేయకుండా తగుదునమ్మా!అంటూ రాణీ మాలినీ దేవి దంపతులను చూడటానికి వచ్చాడు.వచ్చినవాడు చూచి వెళ్ళిపోతే ఈకథ రాయాల్సిన అవసరమూ ఉండేది కాదు.అతని విచిత్రమైన ప్రవర్తనకు ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితీ ఉండేది కాదు.విపరీతమైన కోపంతో,ఈర్ష్యతో దవడ కండరం బిగించి మింగేసేలా చూడటం అతని సంస్కార రాహిత్యనికి చిహ్నం.ఇంటికి వచ్చిన తర్వాత రోజూ అలవాటు ప్రకారం అందరూ కూర్చుని మాట్లాడుకుంటుండగా ఈవిషయం చర్చకు వచ్చింది.అక్కడే నాతో చెపితే సరిపోయేది కదా అన్నారు ఆమె భర్త.గోటితో పోయేది గొడ్డలి వరకూ ఎందుకు?అని చెప్పలేదు అంది రాణీ మాలినీ దేవి.జమిందారు గారి కోరిక మేరకు రాణీ మాలినీ దేవి పిల్లలు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు కనుక వాళ్ళు అతనికి జీవితంలో తగిలిన ఎదురు దెబ్బల వల్ల మానసికంగా తేడా ఉండి అలా ప్రవర్తించి ఉంటాడు అని తీర్మానించారు.అయ్యో!పాపం అని జాలిపడి ఈవిషయాన్ని తేలిగ్గా తీసుకోలేని పరిస్థితి రాణీ మాలినీ దేవిది.ఎందుకంటే మానసిక రోగి అయినాసరే 35 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన గుర్తుపెట్టుకుని ఆమెపై,ఆమె భర్తపై కోపంతో రగిలిపోతున్నాడంటే అటువంటి వాళ్ళు ఎప్పుడూ ఎలా ప్రవర్తిస్తారో తెలియదు కనుక తగుజాగ్రత్తలో ఉండాలని రాణీ మాలినీ దేవి కుటుంబం నిర్ణయించుకుంది.
(సమాప్తం)
No comments:
Post a Comment