పూజిత స్నేహితురాళ్ళతో కలిసి బట్టలు కొనడానికి వెళ్ళింది.వచ్చేటప్పుడు దగ్గర దారిలో అయితే త్వరగా ఇంటికి చేరుకోవచ్చనే ఉద్దేశ్యంతో బయదేరుతుండగా ఇంకొక స్నేహితురాలు అటువైపు ఈ సమయంలో వాహనాలు నిలిచిపోతుంటాయి.అందుకని దూరమైనా వేరే దారిలో వెళ్ళమని చెప్పింది.అయినా వినిపించుకోకుండాపూజిత,స్నేహితురాలు కలిసి అదే దారిలో ప్రయాణించటం మొదలెట్టారు.కొద్ది దూరం వెళ్ళేసరికి ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి.ఎంత సమయమైనా ఒక్క వాహనము కూడా కదలటం లేదు.బాగా విసుగుతోపాటు,తలనొప్పి కూడా మొదలైంది.ముందుకు,వెనక్కు కూడా వెళ్ళలేని పరిస్థితి.స్నిహితురాలు చెప్పినా వినకుండా బుద్ధి గడ్డి తిని ఈ దారిలో వచ్చామని స్నేహితురాళ్ళు తమని తాము తిట్టుకున్నారు.
No comments:
Post a Comment