వ్యాపారంలోనయినా,ఉద్యోగంలోనయినా,ఇంటిపనుల్లోనయినా మగవారికన్నామూడురెట్లు మహిళలే కష్టపడి బద్దకించకుండా పనులు పూర్తి చేయ్యడంలో ముందంజలో ఉన్నారు.రోజంతా పనిచేసినా చురుగ్గా ఇంటికొచ్చాక సోమరితనం అనేది లేకుండా ఇంటిపనులు చక్కబెడతారు.వ్యాపారంచేసే మహిళలు బ్యాంకు రుణాలు తీసుకుంటే నిర్ణీత సమయం కన్నా ముందే కట్టేస్తుంటారని మహిళలకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు వస్తున్నాయి.మగవాళ్ళు ఏపనినయినా తేలిగ్గా తీసుకుంటారని,మహిళలు దేన్నయినా పట్టుదలతో కృషి చేసి సాధించగలరని విశ్లేషకుల అభిప్రాయం.ప్రతి పురుషుని విజయం వెనుక తల్లి,భార్య,సోదరి,అమ్మమ్మ,నానమ్మ ఎవరైనా ఒక స్త్రీ ఉంటుందన్నది యదార్ధం.
No comments:
Post a Comment