సురేంద్ర,నాగేశ్వరి దంపతులకు ఇద్దరు పిల్లలు.బాబు,పాప.భార్యభార్తలిద్దరూ కష్టపడే తత్వం కలవాళ్ళు.ఎంతో అన్యోన్యంగా ఉంటూ పిల్లలను ప్రేమగా పెంచుకుంటున్నారు.వాళ్ళు కష్టపడినా పిల్లల భవిష్యత్తు బాగుండాలని వారి గురించి కలలుకంటూ మంచిస్కూల్లో చేర్పించారు.వాళ్ళు కూడా చక్కగా చదువుకుంటున్నారు.
వీళ్ళ కుటుంబాన్ని చూచి అందరూ ముచ్చటపడేవారు.పాప హైస్కూల్లో చదువుతుండగా స్కూల్లో ఏదో గొడవ జరిగిందని తెలిసీ తెలియనితనంతో ఇంటికి వచ్చి ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది.ఆబాధ తట్టుకోలేక,ఆఅమ్మాయి జ్ఞాపకాలు మర్చిపోలేక ఆఇంటిని వదిలి సిటీకి మకాం మార్చారు.ఎక్కడికి వెళ్ళినా ఎలా మరచిపోగలరు?నాగేశ్వరి మానసికంగా కృంగిపోయి నాపిల్లను తెచ్చివ్వండి అంటూ ఏడవటం లేదా తెచ్చివ్వలేకపోతే ఎలాగైనా నేను మళ్ళీ ఆడపిల్లను కనవలసిందేనని పట్టుబట్టి ఎవరు చెప్పినా వినకుండా 20 సంవత్సరాల తర్వాత తిరిగి మరల రీకెనలైజేషన్(పిల్లలు పుట్టకుండా చేయిచుకుని తిరిగి మళ్ళీ ఆపరేషన్ చేయించుకోవటం అన్నమాట) చేయించుకుని అదే ఆడపిల్ల మళ్ళీ తన కడుపున పుడుతుందనే పిచ్చి నమ్మకంతో చివరకు మళ్ళీ మగబిడ్డకు జన్మనిచ్చింది.పిల్ల బ్రతికుండగా నేను మపిల్లాడినయితే బాగుండేది అనేది కనుక మగబిడ్డ రూపంలో పుట్టిందని సరిపెట్టుకుని అపురూపంగా పెంచుకుంటూ పాత జ్ఞాపకాలను కొంతవరకు తరిమి కొట్టింది.వాడిని బుడ్డిగాడు అని ముద్దుగా పిలిచేది.వాడు పెరిగి పెద్దయి చదువుకుని ఉద్యోగం చేసుకుంటున్నా,పెళ్లీడు కొచ్చినాబుడ్డిగాడు అని పిలుస్తుంది. కొద్దిసేపు కనిపించకపోయినా మా బుడ్డిగాడు ఏమి చేస్తున్నాడో?అంటూ మితిమీరిన ప్రేమతో బుడ్డిగాడి గురించి తెగ బాధపడిపోతుంటుంది.ఈ ఉదంతం గురించి తెలిసు కనుక బుడ్డిగాడు అంటూ ఎప్పుడూ కలవరిచినా,వాడి ముచ్చట్లు చెప్పినా ఎవరూ విసుక్కోరు.
http://www.netitelugu.com/telugu/facebook-video-creating-option/
ReplyDelete